విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై టీడీపీ నోట్ విడుదల చేసింది.ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నోట్ ను రిలీజ్ చేశారు.
గత నాలుగేళ్ల కాలంలో ఏపీలో ఒక్క సదస్సు కూడా జరగలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు సదస్సులు నిర్వహించామన్న ఆయన దాదాపు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని తెలిపారు.అప్పటిలో పెట్టుబడులను తెచ్చుకోవడంలో రాష్ట్రం మూడవ స్థానంలో ఉండేదని చెప్పారు.
కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడులను ఆకర్షించడంలో పదమూడవ స్థానానికి పడిపోయిందని విమర్శలు గుప్పించారు.