షర్మిల ఎంట్రీ.. కాంగ్రెస్ కు నష్టమేనా ?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల( YS Sharmila ) తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ తో కూడా చర్చలు జరిపిన ఆమె త్వరలోనే విలీనంకు సంబంధించి తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

అయితే ఆమె కాంగ్రెస్ లో చేరితే పార్టీకి లాభామా ? నష్టమా ? అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.ప్రస్తుతం ఆమె టి కాంగ్రెస్ లో కొనసాగాలని భావిస్తుండడంతో ఆమె ఒకవేళ ఆమె టి కాంగ్రెస్ లో కొనసాగితే నష్టమే ఎక్కువ అని చెబుతున్నారు కొందరు.

ఎందుకంటే టి కాంగ్రెస్( Telangana Congress ) పై అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth ReddY )పై నిన్న మొన్నటి వరకు చిప్పులు చెరిగిన ఆమె ఇప్పుడు సడన్ గా అదే పార్టీలో చేరడం వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న సానుకూల దృక్పథం తగ్గిపోతుందని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు.అందుకే ఆమె రాకను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు.టి కాంగ్రెస్ కు ఆమె సేవలు అవసరం లేదని తేల్చి చెబుతున్నారు.

కానీ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

Advertisement

అయితే ఏపీ కాంగ్రెస్ లో షర్మిల చేరడం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది తప్పా అద్భుతాలెవీ జరగవని ఏపీపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ తులసి రెడ్డి ( Tulasi Reddy )వ్యాఖ్యానించారు.అయితే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల చేపట్టడం వల్ల ఆమె అన్న జగనే లాభం ఎక్కువ అని ఆయన చెప్పుకొచ్చారు.దీంతో ఆమె తెలంగాణ కాంగ్రెస్ లో చేరితే కే‌సి‌ఆర్ కు ఒకవేళ ఏపీ కాంగ్రెస్ లో చేరితే జగన్ కు మేలు జరుగుతుందే తప్పా కాంగ్రెస్ కు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదని హస్తం నేతలే చెబుతున్నారు.

దీంతో షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.మరి జరుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు