అవుననే అంటున్నారు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.లక్ష్మీపార్వతి( Lakshmi Parvathi ) మితిమీరిన జోక్యంతో ఆరోజు టిడిపిలో ఎలా అయితే సంక్షోభం పుట్టిందో ఇప్పుడు అదే రీతిగా సజ్జల వ్యవహారం వైసిపి పుట్టి ముంచేటట్టుగా తయారయిందని ఆయన వివరించారు.
ఢిల్లీలోని విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వైసీపీ వ్యవహారాలను విశ్లేషించారు 1995 లో మంత్రివర్గ వ్యవహారాలలో మితిమీరిన ప్రమేయం చూపించిన లక్ష్మీపార్వతి వ్యవహార శైలి నచ్చని చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు వైస్రాయ్ హోటల్ వేదికగా తిరుగుబాటు చేసి తమ నాయకుడిగా చంద్రబాబును ఎన్నుకున్నారు ఒకరకంగా ఎన్టీఆర్ పదవి పోవడానికి , చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మీపార్వతి అతి ప్రవర్తనే కారణమని చాలామంది విశ్వాసం.
సరిగ్గా ఇప్పుడు అదే అంశాన్ని తీసుకొని వైసిపికి ముడి పెడుతున్నారు రఘురామ కృష్ణంరాజు.
సజ్జల రామకృష్ణా రెడ్డి( Sajjala Ramakrishna Reddy ) ప్రజల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధి కాదని సాక్షి దినపత్రికలో ఒక ఉద్యోగి గా పనిచేస్తున్న సజ్జలను తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు అందరికీ బాసుగా నిలబెట్టి ప్రతి విషయాన్ని ఆయనకు రిపోర్ట్ చేయాలని చెప్పడం ప్రజల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను అవమానించడమేనని దీనివల్ల ఎమ్మెల్యేల మనోభావాలు దెబ్బతింటున్నాయని మెజారిటీ ఎమ్మెల్యేలలో జగన్ (YS Jagan Mohan Reddy )పట్ల ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ వారితో వ్యవహరిస్తున్న ఇలాంటి విధానాల వల్ల ఎమ్మెల్యేలు జగన్కు దూరమైతున్నారని ఆయన చెప్పుకొచ్చారు..
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి అత్యంత విధేయులైన ఎమ్మెల్యేలను దూరం చేసుకోవడం కచ్చితంగా జగన్ పార్టీకి నష్టమే అని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ జగన్తో నడిచిన మేకపాటి కుటుంబం పట్ల వ్యవహరించాల్సిన విధానం ఇది కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana Reddy ) ప్రసంగం చాలా హుందాగా ఉందని ఆయనకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
అవ్వడానికి వ్యతిరేక వర్గం ఎమ్మెల్యే అయినా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం జగన్ మంచి కోసమే అన్నట్టుగా ఉన్నాయి మరి వైరి వర్గం నుంచి వచ్చిన సూచనలు జగన్ ఏ మేరకు లెక్కలోకి తీసుకుంటారో చూడాలి.