ఇండియన్ సినిమాకు వెయ్యి కోట్ల నెంబర్ ను చూపించిన సినిమా బాహుబలి 2 అనే విషయం తెల్సిందే.బాహుబలి 2 సినిమా ఏకంగా రూ.1800 కోట్ల ను వసూళ్లు చేసిన విషయం తెల్సిందే.ఆ సినిమా కలెక్షన్స్ ను ఇప్పటి వరకు మరే సినిమా కూడా బ్రేక్ చేయలేదు.
బాహుబలి మేకర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసిన విసయం తెల్సిందే.కానీ 1300 కోట్ల రూపాయల వసూళ్ల వద్దే ఆర్‌ఆర్ఆర్ నిలిచి పోయింది.
తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పలు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట నామినేషన్స్ ను దక్కించుకుంది.
దాంతో మళ్లీ అమెరికాతో పాటు పలు దేశాల్లో ఆర్ ఆర్ ఆర్ సినిమా మళ్లీ విడుదల అవ్వబోతుంది.జపాన్ లో ఏకంగా వంద రోజులు ఆర్ ఆర్ ఆర్ ఆడింది.

అక్కడ సాధించిన కలెక్షన్స్ తో పాటు ముందు ముందు అమెరికా ఇంకా ఇతర దేశాల్లో మళ్లీ విడుదల అయితే వచ్చే కలెక్షన్స్ ను కలిపితే కచ్చితంగా బాహుబలి 2 సినిమా యొక్క వసూళ్లను బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది.

అయినా కూడా బాహుబలి 2 కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తుంది అనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయడం ఆర్ ఆర్ ఆర్ కి సాధ్యం కాదు అంటూ ప్రభాస్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి రాబోయే సినిమా లు కూడా బాహుబలి 2 యొక్క రికార్డులను బ్రేక్ చేయడం సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
