రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్సా ? ఓవర్ కాన్ఫిడెన్సా ?

ఈసారి తెలంగాణలో జరుగుతున్నా అసెంబ్లీ ఎలక్షన్స్( Assembly Elections ) లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ముఖ్యంగా కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ టీపీసీసీ  చీఫ్ రేవంత్ రెడ్డి మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.

 Is Revanth Reddy Over Confident , Revanth Reddy, Ts Politics , Brs , Congress Pa-TeluguStop.com

గత ఆర్నెళ్ల వరకు రాష్ట్రంలో ఏ మాత్రం ప్రభావం లేని హస్తంపార్టీ సరిగ్గా ఎన్నికల ముందు విజయంపై ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణం ఏంటి ? నిజంగానే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా ? లేదా కాంగ్రెస్ పగటి కలలు మాత్రమేనా ? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది.

Telugu Assembly, Congress, Kodangal, Revanth Reddy, Ts-Politics

అయితే తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చేస్తున్న వ్యాఖ్యలు కొంత ఓవర్ కాన్ఫిడెంట్ గానే ఉన్నాయనేది చాలమంది అభిప్రాయం.ఇంకా ఫలితాలు వెలువడనప్పటికి ఆల్రెడీ ఎన్నికల్లో గెలిచినట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారనేది చాలమంది అభిప్రాయం.డిసెంబర్ 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నామని, అదే రోజున ఆరు గ్యారెంటీ హామీలపై సంతకాలు చేస్తామని, తొలి మంత్రివర్గ సమావేశం కూడా అదే రోజు నిర్వహిస్తామని ఇలా ముందుకు ముందే వ్యాఖ్యానిస్తుండడంతో ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఇంకా ఏది జరగకముందే అధికారంలోకి వచ్చినట్లు రేవంత్ రెడ్డి పగటికలలు కంటున్నారనేది కొందరి అభిప్రాయం.

Telugu Assembly, Congress, Kodangal, Revanth Reddy, Ts-Politics

ఇకపోతే రేవంత్ రెడ్డి కోడంగల్ ( Kodangal )మరియు కామారెడ్డి రెండు చోట్ల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.కోడంగల్ లో ఈసారి విజయం తథ్యం అని అలాగే కామారెడ్డిలో కూడా కే‌సి‌ఆర్ ను ఒడిస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.ఇలా పార్టీ గెలుపు విషయంలోనూ, తాను పోటీ చేస్తున్న నియోజక వర్గాల విషయంలోనూ రేవంత్ రెడ్డి ఫుల్ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు.మరి నిజంగానే ఆయన విజయంపై ధీమాగా ఉన్నారా? లేదా అవన్నీ ఓవర్ కాన్ఫిడెన్స్ గానే మిగిలి పొనున్నాయా ? అనేది తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఎదురు చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube