రోజురోజుకూ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ముఖ్యంగా వైసీపీ జనసేన పార్టీల మద్య చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
గత కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విపరీతంగా టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆయన పై విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు.రాష్ట్ర ప్రయోజనాల గురించి గాని, రాష్ట్ర సమస్యలను గురించి గాని ఏ నాడు ప్రెస్ మీట్లు వైసీపీ నేతలు పవన్ విషయంలో మాత్రం తరచూ మీడియా ముందుకు వస్తుంటారు.
ముఖ్యంగా పవన్ ను టార్గెట్ చేసే విషయంలో ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు( \Ambati rambabu ) ముందు వరుసలో ఉంటారు.పవన్ ప్రభుత్వంపై చేసే విమర్శలకు వ్యంగ్యస్త్రాలు సంధిస్తూ రీకౌంటర్ ఇస్తుంటారు అంబటి.
ఇక మరోసారి ప్రెస్ మీట్ పెట్టి మరి వ్యంగ్యస్త్రాలు సంధిచారు అంబటి.అది రాజకీయవిషయంలో కాదండోయ్ సినిమాల విషయంలో ఇంతకీ అసలు విషయమేమిటంటే పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ మూవీ జయాపజయల గురించి పక్కన పెడితే మూవీలో పృధ్వీరాజ్( Prudhvi Raj ) పోషించిన శ్యాంబాబు క్యారెక్టర్ అంబటి రాంబాబు ను పోలి ఉందనే విషయంలో రాజకీయ రగడ రాజుకుంది.దాంతో ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ పై విమర్శలు గుప్పించారు అంబటి.
నిత్య పెళ్లి కొడుకు, మూడుముళ్ళు-ఆరు పెళ్లిళ్లు ఇలా పలు టైటిల్ లను ప్రకటిస్తూ వీటిపై త్వరలోనే సినిమా తీయబోతున్నామని పవన్ను ఉద్దేసింది వ్యంగ్యస్త్రాలు సంధించారు.అడితే అంబటి రాంబాబుకు కౌంటర్ గా జనసేన నేతలు కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు.
త్వరలోనే తముకూడా పలు సీనిమాలు తీయబోతున్నామని ఆ సినిమాల పేరు ఏవంటే.కాంబాబు రాసలీలలు, సంజన-సుకన్య, గంటా అరగంట అనే టైటిల్స్ ను ప్రకటించారు జనసేన నేతలు.దీంతో అంబటి ప్రకటించిన టైటిల్స్ కంటే జనసేన నేతలు ప్రకటించిన టైటిల్స్ సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ అవుతున్నాయి.ఎందుకంటే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా అంబటి అనవసర విషయాలపై స్పందించి తన పరువు తానే తీసుకుంటున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు.
సినిమా ను సినిమాగా చూడకుండా మూవీలోని క్యారెక్టర్ ను తనకు అన్వయించుకొని.దానిపై ప్రెస్ పెట్టి మరి పరువు తీసుకోవడం రాష్ట్ర ప్రజల ఎదుట నవ్వులపాలు తప్పా ఇంకోటి లేదనేది కొందరి రాజకీయ అతివాదుల అభిప్రాయం.