ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయని దర్శకుడు నాగ్ అశ్విన్ ( Nag Ashwin )విడుదల తేదీ ప్రకటించడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ అభిమానులు వచ్చే సంక్రాంతి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం ప్రాజెక్ట్ కే సినిమా కచ్చితంగా సంక్రాంతికి రాకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అందుకే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.అంతే కాకుండా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ను కూడా సంక్రాంతికి విడుదల చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా నిర్మాత దిల్ రాజు( Dil raju ) ఇటీవలే ప్రకటించాడు.

ఈ రెండు సినిమాలు సంక్రాంతికి పోటీ పడే అవకాశాలు దాదాపు కన్ఫర్మ్.అంతకంటే ముందు ప్రకటించిన ప్రాజెక్ట్ కే సినిమా విడుదల అవుతుందా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.ఇప్పటి వరకు నాగ్ అశ్విన్ నుండి కొత్త ప్రకటన రాలేదు.
అయితే ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించాం కనుక ఆ తేదీకి వచ్చి తీరుతాం అన్నట్లుగా నిర్మాత అశ్వినీదత్ ఇటీవల ఒక సందర్భంగా పేర్కొన్నాడు.మొత్తానికి ప్రాజెక్ట్ కే సినిమా విషయంలో ఉన్న అనుమానాలకు తెర పడాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ప్రభాస్ ( Prabhas )వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు కనుక ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ సమయానికి పూర్తి అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.







