పవన్ వ్యాఖ్యలు తన సామాజిక వర్గాన్ని మెప్పించాయా ?

కత్తిపూడి బహిరంగ సభ వేదిక గా పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీసాయి గతంలో పార్టీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం పదవి పై ఒకింత నిరుత్సాహంగా మాట్లాడిన పవన్ ( Pawan kalyan )కత్తిపూడి వేదికగా మాత్రం చాలా స్పష్టంగా సీఎం పదవి ఇస్తే తీసుకుంటానంటూ వ్యాఖ్యానించారు .ఇవ్వాల్సింది ప్రజలే అయినప్పటికీ తన సామాజిక వర్గం గట్టిగా ప్రయత్నిస్తే పవన్ కి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి.

 Is Pavan Get His Community Support This Time? , Pawan Kalyan , Ap Politics , Ycp-TeluguStop.com

అయితే పవన్ రాజకీయ ప్రయాణం మీద అంత సంతృప్తిగా లేని ఆయన సామాజిక వర్గం ఆయనతో కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తుంది.తనకు కులాలు ముఖ్యం కాదని పవన్ పదేపదే చెబుతున్నప్పటికీ కులం ఆదారిత రాజకీయాలు మాత్రమే నడిచే ఆంధ్రప్రదేశ్లో కులాల మద్దతు తప్పనిసరి.

అందుకే పార్టీలు కూడా అభ్యర్థులను ఆయా స్థానాలలో ఉన్న సామాజిక వర్గాలను బట్టే నిర్ణయిస్తుంటాయి.అందువల్ల జనసేన ఎంత కాదనుకున్న కాపు సామాజిక వర్గం ఓట్లు లేకుండా గమ్యాన్ని చేరలేదు.

Telugu Ap, Chandrababu, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

తెలుగుదేశం పార్టీతో సఖ్యత నడపటం సాయన సామాజిక వర్గంలో చాలా మందికి రుచించని విషయం.ముఖ్యంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ ( Mudragada Padmanabham )వ్యవహారంలో చంద్రబాబు ( Chandrababu Naidu )వ్యవహరించిన శైలి కాపులలో ఆయనకు శత్రువులు తెచ్చిపెట్టింది .అయితే ఈసారి జనసేన వ్యూహాత్మకంగా ఎన్నికలకు సిద్ధమవుతుండటం , తన బలం గుర్తించి ముందుకు వెళ్ళటం వంటి సంకేతాలతో ఈసారి పవన్ సరైన ట్రాక్ లోనే ఉన్నారని అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది .

Telugu Ap, Chandrababu, Pawan Kalyan, Ys Jagan-Telugu Political News

దీంతో ఆయన సామాజిక వర్గం కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని , అంగ బలం, అర్థబలంతో తోడ్పాటు ఇవ్వాలని చూస్తునట్లుగా కూడా విశ్లేషణలు వస్తున్నాయి.కనీసం 30 నుంచి 40 స్థానాలలో తన బలం జనసేన నిరూపించుకుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో ప్రబుత్వ ఏర్పాటు లో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఏమాత్రం అనుమానం లేదు.మాజిక్ పిగర్ 88 కాబట్టి 30నుంచి 40 సీట్లు కూడా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది .మరి ఇదే ఊపును జనసేన ని కొనసాగిస్తే మాత్రం జన సైనికుల కల నెరవేరడానికి ఎంతో దూరం లేదని చెప్పవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube