వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి తలపోటుగా మారిన నేతల్లో కనుమూరి రఘురామకృష్ణంరాజు అలియాస్ త్రిబుల్ ఆర్ ఒకరు.ఆ పార్టీ టికెట్ మీద గెలిచి ఆ పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తూ విచిత్రమైన రాజకీయం చేస్తున్న వ్యక్తిగా ఆయనకు పేరు ఉంది.
వచ్చే ఎన్నికలలో టిడిపి జనసేన పొత్తు ఖాయమని ఆ పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా తనకు టిక్కెట్ దక్కుతుందని ఆశలతో ఆయన ఉన్నారు.అయితే మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) నుంచి ఆయనకు మొన్నటి వరకు ప్రమాదం పొంచి ఉన్నట్టుగా వార్తలు వచ్చేవి.
జనసేన తరపున నరసాపురం ( Narasapuram ) పార్లమెంట్ స్థానానికి నాగబాబు పోటీ చేస్తారని జన సైనికులు చెప్పుకొచ్చేవారు.
ఆ మధ్య పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా నరసాపురం పార్లమెంటరీ బాధ్యతలను నాగబాబు చూస్తారు అని చెప్పారు దానిని బట్టి ఎంపీ స్థానానికి నాగబాబు ఎమ్మెల్యే స్థానానికి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పోటీ చేస్తారని విశ్లేషణలు వచ్చాయి.అయితే మెగా బ్రదర్ రూటు మార్చుకొని రెబల్ ఎంపీ కి దారి ఇచ్చినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న నాగబాబు వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత తన మీద ఉన్నందున ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగే ప్రయత్నాన్ని విరమించుకుంటున్నానని

ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా కార్యకర్తలతో ప్రకటించారట.దాంతో రఘురామకృష్ణం రాజుకు( Raghurama Krishnamraju ) రూట్ క్లియర్ అయినట్టు అయింది అయితే ఆయన జనసేన టికెట్ నుంచి పోటీ చేస్తారా తెలుగుదేశం పార్టీ టికెట్ నుంచి పోటీ చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.ఈ రెండు పార్టీలలోనూ ఆయనకు అనుకూలత ఉండటంతో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే.అయితే ఎంపీగా గెలిచినప్పటి నుంచి రకరకాల కారణాలతో నరసాపురం ముఖం కూడా చూడని ఎంపీ గారిని నరసాపురం ప్రజలు ఎంత మేరకు ఆదరిస్తారు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది .

ప్రభుత్వం కేసులు పేరుతో బుక్ చేస్తుందన్న భయంతో ఆయన ఢిల్లీ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు తప్ప నియోజక వర్గం లో అడుగు పెట్టడం లేదు ….ఆ మధ్య అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణకు వస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా తన హత్య కి కుట్ర జరుగుతుందన్న ఆరోపణలు చేస్తూ ఆయన వెనకంజు వేశారు .మరి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిన ఎంపీ గారికి ప్రజల మద్దతు ఏ మేరకు దక్కుతుందో లేక సానుభూతి పనిచేస్తుందో ఆయన మరొకసారి ఎంపీగా గెలవగలరా లేదా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.