తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడ్డాయి.విడివిడిగా పోటీ చేస్తే… విజయావకాశాలు తక్కువగా ఉంటాయని, అందుకే కూటమిగా కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలన్నీ ఒక్కటయ్యాయి.
సీట్ల సర్దుబాట్లు కూడా జరుగుతున్నాయి.అయితే ఇక్కడే అసలు సమస్య ఏర్పడింది.
కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓకే కొలిక్కి రావడంలేదు.దీంతో ఇందులో ఉన్న పార్టీల మధ్య విబేధాలు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి అధినేత ప్రొ.కోదండరాం.ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో చర్చలు జరుపుతున్నారు.కాంగ్రెస్ పార్టీ.టీజేఎస్‌కు కేవలం మూడు సీట్లు మాత్రమే ఇస్తమనే ప్రతిపాదన పెట్టడంతో కోదండరాం అసంతృప్తికి గురయ్యారు.వెంటనే తన దగ్గర ప్లాన్ బీ ఉందని చెబుతున్న ఆయన.దాన్ని అమలు కూడా ప్రారంభించారు.బీజేపీ నేతలతో కోదండరామ్ వరుస రహస్యంగా సమావేశం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దత్తాత్రేయతో గంట పాటు చర్చలు జరిపారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.మహాకూటమిలో గెలిచే స్థానాలు వదులుకోకూడదని కాంగ్రెస్ భావిస్తోంది.
కానీ తమకు కనీసం పదిహేడు స్థానాలు కావాలని జనసమితి డిమాండ్ చేస్తోంది.కానీ దానికి కాంగ్రెస్ ఒప్పుకోవడంలేదు.

ఈ నేపథ్యంలో బీజేపీతో జత కలిసేందుకు తాను కోరుకున్న సీట్లు దక్కించుకునేందుకు కోదండరామ్ బీజేపీతో జత కలిసేందుకు కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.కోదండరాంతో చర్చల విషయాన్ని ఆ పార్టీ నేత కిషన్ రెడ్డి అంగీకరించారు.తెలంగాణ జన సమితితో పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదని, చర్చలు జరుగుతున్నాయని మాత్రం ఆఫ్ ది రికార్డుగా మీడియాకు చెప్పారు.తెలంగాణ పునర్నిర్మాణంలో కోదండరాం కీలకపాత్ర పోషించాలనుకుంటున్నారు.
కూటమిలో సర్థుకుపోదామనుకున్నా.రాబోయే ప్రభుత్వం తన ఆశయాలకు అనుగుణం నడుస్తోన్న గ్యారంటీ లేదు.
అందుచేత మహాకూటమికి కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించాలనీ.కూటమిలో చేరుతున్నందుకు పరిహారంగా కామన్ మినిమం ప్రోగ్రాం తయారు చేసే ఛైర్మన్ గా అయినా ఉందామని కోదండరాం ఆశించారు.
కానీ కాంగ్రెస్ దీనిపై ఏ విషయమూ చెప్పడం లేదు.అందుకే కోదండరాం ఏం నిర్ణయం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు.







