వరదలపై కేసీఆర్ వాదన నిజమా? పువ్వాడ ఆరోపణలు వాస్తవమా?

తెలంగాణలో గోదావరి వరదలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

అయితే సందట్లో సడేమియా తరహాలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఏపీలోని పోలవరం ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేశారు.

పోలవరం కారణంగానే తెలంగాణలోని భద్రాచలానికి వరదలు వచ్చాయని వక్రభాష్యం చెప్పారు.మరోవైపు సీఎం కేసీఆర్ మాత్రం పోలవరం పేరు ఎత్తలేదు.

వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణమంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.కేసీఆర్ ఆరోపణలను రాజకీయ మేధావులు కొట్టిపారేసినా ఇంకా చర్చ మాత్రం నడుస్తూనే ఉంది.

అయితే ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని గమనిస్తే వరదల విషయంలో ఒకే పార్టీ నుంచి ఇద్దరు వేర్వేరు ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.కేసీఆర్ అన్నట్లు వరదల వెనుక విదేశీ కుట్ర జరిగితే ఒక్క తెలంగాణకే సమస్య ఎందుకు వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

వరదలతో ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదని ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు అసోం రాష్ట్రం కూడా దెబ్బతిన్నాయని పలువురు గుర్తుచేస్తున్నారు.ఏపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు పెంచుతోందని.

అందుకే నీరు వెనక్కి వచ్చి భద్రాచలం మునిగిపోయే ప్రమాదం ఏర్పడిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించడంతో ఏపీ నేతలు పువ్వాడ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.దీంతో విలీన మండలాలపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది.

అయితే వరదలకు అసలు రీజన్ మాత్రం ఇప్పటివరకు ఎవరూ చెప్పలేకపోతున్నారు.

సీఎం కేసీఆర్ చెప్పింది నిజమైతే క్లౌడ్ బరస్ట్ అనే మాటనే పువ్వాడ అజయ్ కుమార్ కూడా చెప్పాలి.ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి.విదేశీ కుట్రను అడ్డుకోలేని మోదీ సర్కారును గద్దె దిగమని డిమాండ్ చేయాలి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

కానీ అలా జరగలేదు.ఇక పువ్వాడ చెప్పిందే నిజమైతే.

Advertisement

గత ఏడాది కూడా భద్రాచలం మునిగిపోయింది.మరి అప్పుడు అడ్డురాని పోలవరం ప్రాజెక్టు.

ఇప్పుడే ఎందుకు అడొచ్చిందన్న విషయంపై పువ్వాడ మాట్లాడాలి.గతంలో పోలవరం ప్రాజెక్టుకు కేసీఆర్ మద్దతు తెలిపిన విషయాన్ని కూడా ప్రస్తావించాలి.

తాజా వార్తలు