తెలంగాణలో తమకు ప్రధాన ప్రత్యర్దిగా కాంగ్రెస్ దూకుడు కు బ్రేకులు వేసేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) చాలా వ్యూహాలే రచిస్తున్నారు.కెసిఆర్ పాల్గొంటున్న ప్రతి మీటింగ్ లోను కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు ప్రధాన హామీలతో పాటు, ఆ పార్టీ మేనిఫెస్టో పైన విమర్శలు చేస్తున్నారు .మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ దానికి అనుగుణంగానే కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరగకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ కర్ణాటక వ్యూహాలను నమ్ముకోవడం , అక్కడ అమలు చేస్తున్న పథకాలను ఇక్కడ హైలెట్ చేస్తూ ప్రచారం చేస్తుండడంతో, కెసిఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను హైలెట్ చేస్తుండడం తో పాటు,
ఏపీలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను హైలెట్ చేస్తూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ లోను కాంగ్రెస్ లో ఉత్సాహం కనిపిస్తుండడం ప్రజల్లోనూ ఈ మేరకు చర్చ జరుగుతుండడంతో, ఆ పరిస్థితికి బ్రేకులు వేసేందుకు కెసిఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు .తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అనేదాన్ని హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.దీనిలో భాగంగా కర్ణాటకలో కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
కర్ణాటక( Karnataka )లో ఐదు గంటలు కరెంట్ ఇస్తుండడాన్ని హైలెట్ చేస్తున్నారు.తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని, కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే రైతులకు కరెంటు కష్టాలు తప్పవని పదేపదే కేసీఆర్ తన ప్రసంగాల్లో చెబుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా కాంగ్రెస్ కు పడకుండా బిజెపి ( BJP )వైపు డైవర్ట్ అయ్యే విధంగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.అందుకే బీజేపీని కాంగ్రెస్ స్థాయిలో టార్గెట్ చేసుకోకుండా వ్యవహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ తో పాటు, బిజెపి వైపు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు రెండు పార్టీలు చేల్చితే అది తమకు గెలుపునకు బాట వేస్తుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.