Mangalavaaram : మంగళవారం సినిమాలోని జమీందారు భార్య పాత్రలో చేసిన హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో వచ్చిన మంగళవారం సినిమా ( Mangalavaaram movie ) ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమా మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది.

 Do You Know The Background Of The Heroine Who Played The Role Of The Landlords-TeluguStop.com

ఇక థియేటర్లలో ఈ సినిమా చూడడానికి జనాలు పోటెత్తుతున్నారు.అజయ్ భూపతి పాయల్ రాజ్ పుత్ ( Payal rajputh ) కాంబినేషన్లో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మళ్లీ వీరి కాంబినేషన్లో వచ్చిన మంగళవారం సినిమా కూడా అంతే పెద్ద హిట్ అయింది.

అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుండి పాయల్ రాజ్ పుత్ తో పాటు మరో హీరోయిన్ గురించి కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Telugu Ajay Bhupathi, Divya Pillai, Mangalavaaram, Naveen Chandra, Payal Rajputh

ఇక మంగళవారం సినిమాలో జమీందారు భార్య పాత్రలో చేసిన అమ్మాయి చూడడానికి చాలా అందంగా పాయల్ రాజ్ పుత్ కి అందంలో పోటీ ఇచ్చింది.అయితే ఈ అమ్మాయి ఎవరు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం జల్లెడ పడుతున్నారు.ఇక జమీందారు భార్య పాత్రలో చేసిన ఆ అమ్మాయి పేరు దివ్య పిళ్ళై( Divya pillai ) .ఈమె కూడా హీరోయినే.అయితే తెలుగులో కాదు మలయాళం లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్న దివ్య పిల్లై తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా ఏం కాదు.

Telugu Ajay Bhupathi, Divya Pillai, Mangalavaaram, Naveen Chandra, Payal Rajputh

దండుపాళ్యం దర్శకుడు తెరకెక్కించిన తగ్గేదెలే అనే సినిమాలో నవీన్ చంద్ర ( Naveen chandra ) సరసన దివ్య పిళ్ళై హీరోయిన్ గా చేసింది.ఇలా దివ్య పిళ్ళై కి ఇది తెలుగులో రెండో సినిమా అని చెప్పుకోవచ్చు.ఇక ఈ సినిమాలో దివ్య పిల్లై నటన టాలెంటును గుర్తించిన అజయ్ భూపతి మంగళవారం సినిమాలో ఆమెకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో అవకాశం ఇచ్చారు.అలా మొదట్లో అంతా ఇమేజ్ లేకపోయినప్పటికీ చివర్లో మాత్రం పెద్ద ట్విస్ట్ ఇస్తుంది.

అలా ఈ హీరోయిన్ కి ఈ సినిమాలో మంచి క్రేజ్ లభించింది.ఇక మంగళవారం సినిమా హిట్ అవ్వడంతో దివ్య పిళ్లై కి తెలుగులో వరుస అవకాశాలు వస్తాయి అని పలువురు నెట్టిజన్లు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube