Mangalavaaram : మంగళవారం సినిమాలోని జమీందారు భార్య పాత్రలో చేసిన హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?
TeluguStop.com
పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో వచ్చిన మంగళవారం సినిమా ( Mangalavaaram Movie ) ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ సినిమా మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది.
ఇక థియేటర్లలో ఈ సినిమా చూడడానికి జనాలు పోటెత్తుతున్నారు.అజయ్ భూపతి పాయల్ రాజ్ పుత్ ( Payal Rajputh ) కాంబినేషన్లో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మళ్లీ వీరి కాంబినేషన్లో వచ్చిన మంగళవారం సినిమా కూడా అంతే పెద్ద హిట్ అయింది.
అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుండి పాయల్ రాజ్ పుత్ తో పాటు మరో హీరోయిన్ గురించి కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
"""/" /
ఇక మంగళవారం సినిమాలో జమీందారు భార్య పాత్రలో చేసిన అమ్మాయి చూడడానికి చాలా అందంగా పాయల్ రాజ్ పుత్ కి అందంలో పోటీ ఇచ్చింది.
అయితే ఈ అమ్మాయి ఎవరు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం జల్లెడ పడుతున్నారు.
ఇక జమీందారు భార్య పాత్రలో చేసిన ఆ అమ్మాయి పేరు దివ్య పిళ్ళై( Divya Pillai ) .
ఈమె కూడా హీరోయినే.అయితే తెలుగులో కాదు మలయాళం లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్న దివ్య పిల్లై తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా ఏం కాదు.
"""/" /
దండుపాళ్యం దర్శకుడు తెరకెక్కించిన తగ్గేదెలే అనే సినిమాలో నవీన్ చంద్ర ( Naveen Chandra ) సరసన దివ్య పిళ్ళై హీరోయిన్ గా చేసింది.
ఇలా దివ్య పిళ్ళై కి ఇది తెలుగులో రెండో సినిమా అని చెప్పుకోవచ్చు.
ఇక ఈ సినిమాలో దివ్య పిల్లై నటన టాలెంటును గుర్తించిన అజయ్ భూపతి మంగళవారం సినిమాలో ఆమెకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో అవకాశం ఇచ్చారు.
అలా మొదట్లో అంతా ఇమేజ్ లేకపోయినప్పటికీ చివర్లో మాత్రం పెద్ద ట్విస్ట్ ఇస్తుంది.
అలా ఈ హీరోయిన్ కి ఈ సినిమాలో మంచి క్రేజ్ లభించింది.ఇక మంగళవారం సినిమా హిట్ అవ్వడంతో దివ్య పిళ్లై కి తెలుగులో వరుస అవకాశాలు వస్తాయి అని పలువురు నెట్టిజన్లు భావిస్తున్నారు.
జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!