బస్సు యాత్రకే ఫిక్స్ అయిపోయిన కేసీఆర్ ?

మూడోసారి కచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామనే ధీమా ను వ్యక్తం రక్తం చేస్తూ ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గట్టి షాక్ నే ఇచ్చాయి.బీఆర్ఎస్ ఊహించని స్థాయిలో అపజయాన్ని మూట కట్టుకుంది.

 Is Kcr Fixed On Bus Trip, Brs Party, Brs,telangana Elections, Kcr, Revanth Reddy-TeluguStop.com

కాంగ్రెస్ తెలంగాణ అధికార పీఠాన్ని దక్కించుకుంది.మరికొద్ది రోజుల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ నేపథ్యంలో మెజారిటీ స్థానాలను దర్శించుకుని బి.ఆర్.ఎస్ పై ప్రజల్లో ఆదరణ తగ్గలేదనే విషయాన్ని నిరూపించుకునేందుకు కేసిఆర్ అనేక రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉండడం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

అసలు ఎన్నికల ప్రచారం చేపట్టడమే బీఆర్ఎస్ కు బ్బందికరంగా మారింది.

Telugu Brs, Kcr Bus, Revanth Reddy, Telangana-Politics

నియోజకవర్గాల వారీగా సభలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్న.వాటిని నిర్వహించేందుకు పార్టీ నేతలు అంతగా ఆసక్తి చూపించడం లేదు.దీంతో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేసీఆర్ స్వయంగా ఎన్నికల ప్రచారానికి దిగేందుకు సిద్ధం అవుతున్నారు.

ఈ మేరకు రాష్ట్రమంతటా బస్సు యాత్ర చేపడితే మంచిదనే ఆలోచనకు వచ్చారు.ఈ మేరకు ఈనెల 18వ తేదీన దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.ఈనెల 18న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు ఈ సందర్భంగా కేసీఆర్ బి ఫారాలు అందించబోతున్నారు.ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో అభ్యర్థికి 95 లక్షల రూపాయల చెక్ లను కేసీఆర్ ఇవ్వనున్నారు.

Telugu Brs, Kcr Bus, Revanth Reddy, Telangana-Politics

ఈ సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై చర్చించి, దీనిపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని బిజెపి, కాంగ్రెస్ లు కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటే.

రాబోయే రోజుల్లో ఆ పార్టీ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇప్పటికే పార్టీ నుంచి కీలక నేతలు చాలామంది వలస వెళ్లారు.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకోకపోతే మరింతగా కష్టాలను ఎదుర్కోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube