తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు, రేవంత్ రెడ్డి కి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం జగ్గారెడ్డి వ్యాఖ్యలు గత కొద్ది నెలలుగా ఇటు కాంగ్రెస్ లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.అయితే జగ్గారెడ్డి మాత్రం నేను కాంగ్రెస్ పార్టీలోనే చివరి వరకు కొనసాగుతానని కాని నాకున్న అభ్యంతరాలను మాత్రం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లాలనేది నా లక్ష్యమని చెప్పిన జగ్గారెడ్డి ఇటీవల రాహుల్ గాంధీతో కుటుంబ సభ్యులతో సహా వెళ్లి కలిసి రాహుల్ తో సమావేశమైన విషయం తెలిసిందే.
అయితే ఆ భేటీ తరువాత ఎన్నాళ్లుగా అనుకున్నది జరిగిందని ఇక పూర్తి స్థాయిలో పార్టీని అధికారంలోకి తీసుకరావడానికి నా వంతుగా పూర్తి స్థాయిలో పని చేస్తానని కాంగ్రెస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని జగ్గారెడ్డి ఘంటాపధంగా చెప్పిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం జగ్గారెడ్డి ఇక పూర్తి స్థాయిలో విజ్రుంభిస్తూ తడాఖా చూపెట్టనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఎంత మేరకు పూర్వ వైభవాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు తీసుకరాగలుగుతారన్నది ఇప్పుడే మనం చెప్పలేకపోయినా ఎంతో కొంత మార్పు ఉండే అవకాశం ఉంది.ఎందుకంటే ప్రస్తుతం అందరూ కెసీఆర్ టార్గెట్ గా ముందుకు సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా రకరకాల నిరసనలకు పిలుపునిస్తూ ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
ఏది ఏమైనా రానున్న రోజుల్లో జగ్గారెడ్డి స్వంత జిల్లాలో బలపడటం కోసమే ప్రయత్నిస్తారా లేక రాష్ట్ర వ్యాప్తంగా బలపడటానికి ప్రయత్నిస్తారా అన్నది రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.







