ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్.జగన్ చెప్పినట్టుగానే నిజంగానే ఆ పరిస్థితులు ఎదురయ్యాయి.
టిడిపి జనసేన, బిజెపి, కాంగ్రెస్ ఇలా అంతా వైసిపిని టార్గెట్ చేసుకున్నా, జగన్ ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు.ధైర్యంగానే అన్ని పార్టీలను ఎదుర్కొని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దేమాను వ్యక్తం చేస్తున్నారు.
అయితే వైసిపి క్యాడర్ లో మాత్రం ఈ విషయంలో అనేక అనుమానాలు, ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో, పార్టీ నాయకులు, కార్యకర్తలలో మనోధైర్యం నింపేందుకు జగన్ సిద్ధమయ్యారు.ఈ మేరకు విశాఖలో భీమిలి వేదికగా నిర్వహించే ‘ సిద్ధం ‘ సభ( Siddam meeting ) ద్వారా అన్ని విషయాల పైన క్లారిటీ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం ఏపీలో టిడిపి, జనసేన కూటమిగా ఏర్పడడం, మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో వైఎస్ షర్మిల( Sharmila ) వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, పార్టీ కార్యకర్తలు, నాయకులు దీనిపై కాస్త ఆందోళన చెందుతుండడం పై జగన్ ఈ సిద్ధం సభలో స్పందించడంతో పాటు ,అనేక అంశాలపై క్లారిటీ ఇవ్వబోతున్నారు.తొలిసారిగా కేడర్ తో నేరుగా మాట్లాడి అనేక అంశాలపై జగన్ క్లారిటీ ఇస్తారు.ఐ ప్యాక్ ఇచ్చిన సిద్ధం ప్లాన్ తో ఏపీలో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను జగన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.ఈరోజు నుంచి వరుసగా జిల్లాల్లో సభలు నిర్వహించి ముందుగా కేడర్ కు అన్ని విషయాల పైన క్లారిటీ ఇచ్చి, వారిలో మనోధైర్యం నింపేందుకు జగన్( Cm YS jagan ) ప్లాన్ చేసుకున్నారు.
దీనికోసమే సిద్ధం అనే పేరుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ఈ రోజు భీమిలిలో సభను ఏర్పాటు చేశారు.భారీ స్లోగన్లతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ‘ సిద్ధం ‘ అనే టైటిల్ ను జనాల్లోకి తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేశారు.జగన్ పిడికిలి గుర్తుతో నిలబడి ఉన్న’ సిద్ధం ‘ పోస్టర్లు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున దర్శనం ఇస్తున్నాయి.
జగన్ నిర్వహించే ఈ సభలకు భారీగా పార్టీ కార్యకర్తలు తరలి వచ్చే విధంగా ప్లాన్ చేశారు
.