చాలామందికి ఇదే అనుమానం.మన పవర్ స్టార్ ఆవేశంతో, ఆలోచనతో చెప్పే ప్రసంగాలు ఎవరు రాస్తారు ? నిజంగానే అవన్నీ పవన్ కళ్యాణ్ ఆలోచనలా లేక తనకో రైటింగ్ టీం ఉందా ? లేదంటే మాటల మాంత్రికుడు, ఆయన క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ రాసే ప్రసంగాలా అవి ? పవన్ అభిమానులకి తప్ప అందరిలోనూ ఇవే అనుమానాలు.మరీ ముఖ్యంగా, ఇవి త్రివిక్రమ్ రాసే మాటలే అనీ ఎదో మూలాన డౌటు.
ఇదే డౌటు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కి దగ్గరి స్నేహితుడైన నిర్మాత బండ్ల గణేష్ ని అడిగారు ఓ టాక్ షోలో.
ఈ ప్రశ్నకు బండ్ల గణేష్ ఘాటైన జవాబే ఇచ్చారు.చెప్పుడు మాటాలు విని ప్రశ్నలు అడగవద్దు అని, పవన్ కళ్యాణ్ కి ప్రసంగాలు రాసిచ్చే సీన్ ఎవరికీ లేదు, ఆయన ఇంటికి వెళితే తెలుస్తుంది, ఆయన ఇంటి నిండా పుస్తకాలే ఉంటాయి తప్ప, సినిమా డివిడిలు ఉండవు, ఆయన జ్ఞానం అపారమైనది, అలాంటి వ్యక్తికి ఒకరు ప్రసంగాలు రాసిచ్చేది ఏంటి అని బండ్ల ఫైర్ అయ్యారు.
అలాగే చెప్పుడు మాటలు విని ఎన్టీఆర్ ని దూరం పెట్టానని, బాద్షా చిత్రంతో నష్టాలు చూసినా, టెంపర్ కి మాత్రం తనకి లాభాలే వచ్చాయని, తానూ ఓసారి ఓ పొలం విషయంలో హీరో రవితేజని మోసం చేసానని, ఇక సచిన్ జోషీని తానూ మోసం చేయడం కాదు, తననే సచిన్ జోషి మోసం చేసాడని, ఇలా నిర్భయంగా తన ఇండస్ట్రీ ప్రయాణం, అనుభవాలు, వివాదాలు అన్ని బయటపెట్టారు బండ్ల గణేష్.







