బెంగళూరు( Bangalore ).దేశంలో ఇదొక ప్రధాన నగరం.
బెంగళూరు అంటే మనకు గుర్తుకు వచ్చేది ఐటీ హబ్( IT hub ).దేశంలోని అన్ని మూలల నుంచి ఉపాధి అవకాశాల కోసం వేలాదిమంది ఈ నగరానికి వస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు బెంగళూరుకు వలస వచ్చారు.ఈ పరిస్థితులతో నగరం కిక్కిరిసిపోతోంది.కానీ, నగర జనాభా పెరుగుతున్న కొద్దీ ఇళ్లు అద్దెకు దొరకటం కష్టతరమవుతోంది.ఇది కొంతమంది ఇంటి యజమానులను ఇష్టారాజ్యంగా అద్దెలను పెంచేలా చేసింది.
నగరంలో రెండు పడక గదుల కలిగిన ఇళ్లకు నెలకు కనీసం రూ.50 వేల నుంచి రూ.90 వేల వరకు అద్దె డిమాండ్ చేస్తున్నారు.అంటే ఒక సాధారణ ఐటీ ఉద్యోగి సంపాదనలో సగానికి పైగా కేవలం ఇంటి అద్దె కోసమే వెచ్చించాల్సి వస్తోంది.
ఈ పరిస్థితి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో బెంగళూరులో ఒక చిన్న గది కోసం ఏకంగా రూ.25,000 అద్దె వసూలు చేస్తున్నట్లు బయటపడింది.ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ వీడియోలో సదరు వ్యక్తి గదిలో రెండు చేతులు చాపగా గోడలు తగిలిపోతున్నాయి.
అది గది ఎంత చిన్నదో ఆ వీడియో చూడగానే స్పష్టమవుతోంది.బాల్కనీ పరిస్థితి కూడా అంతే.ఓ వ్యక్తి ప్రశాంతంగా నిలబడటానికి కూడా సరిపోదు.

ఈ గదిని అద్దెకు తీసుకున్న వ్యక్తి కాస్త వెంగ్యంగా స్పందిస్తూ, ఇలాంటి చిన్న గదికి కూడా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాడు.ఇలాంటి ఇంట్లో ఉంటే కొత్తగా ఎక్కువ వస్తువులు కొనరు.దీని వల్ల డబ్బు ఆదా అవుతుందని అభిషేక్ అనే వ్యక్తి సరదాగా వ్యాఖ్యానించాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో కేవలం కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ వారి స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.కొండరాయి ఏకంగా అతడుంటున్న రూమ్ మా బాత్‌రూమ్ కంటే చిన్నగా ఉందంటూ కామెంట్లు చేశారు.కొంతమంది బెంగళూరులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆకాశాన్నంటుతున్న అద్దెలతో బెంగళూరులో బతకడం కష్టమవుతోందని కొందరు ఐటీ టెక్కీలు అభిప్రాయపడుతున్నారు.హైదరాబాద్‌లో బెంగళూరుతో పోలిస్తే అద్దెలు తక్కువగా ఉండటంతో, కొందరు హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకోవడమే మంచిదని భావిస్తున్నారు.
అద్దెల ఉధృతిని అరికట్టడంలో కర్ణాటక ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోలేదు.బెంగళూరులో ఇళ్లు అద్దెకు తీసుకోవాలనుకునేవారు ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే గానీ పరిస్థితులు మెరుగుపడవు.







