అందరి చేతుల్లో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉంది.దానిలో వాట్సాప్ కూడా ఖచ్చితంగా ఉంటుంది.దాని నుండి మీరు తరచుగా కాల్ చేయవచ్చు.మీ సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడుతూ ఉండొచ్చు.అంతేకాకుండా ఫేస్‌బుక్ మెసెంజర్ లేదా ఏదైనా ఇతర కాలింగ్ యాప్‌ల ద్వారా ఉచిత కాల్‌లు చేయగలిగారు.అయితే రాబోయే కాలంలో ఈ ఫ్రీ కాల్స్ అన్నీ ఉండవు.
కొద్ది కాలంలోనే వాట్సాప్ కాలింగ్ సదుపాయానికి బిల్లు వసూలు చేసే అవకాశం ఉంది.ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్లు 2022, దీని ముసాయిదా పూర్తిగా సిద్ధమైంది.
ఇందులో టెలికాంకు సంబంధించిన అనేక మార్పులు ఉన్నాయి.ఇందులో ఇంటర్నెట్ కాలింగ్ కూడా ఒకటి.
సోషల్ మీడియా యాప్‌ల ద్వారా చేసే కాల్‌లకు మీరు చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంది.దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్లు 2022 ముసాయిదా ప్రకారం, కాలింగ్ మరియు మెసేజింగ్ సౌకర్యాలను అందించే వాట్సాప్, స్కైప్, జూమ్ మరియు టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు విభిన్నంగా పని చేస్తాయి.ఈ ప్లాట్‌ఫారమ్‌లు భారతదేశంలో పనిచేయడానికి టెలికాం కంపెనీల వలె లైసెన్స్ పొందవలసి ఉంటుంది.
ఈ కారణంగా, ఈ యాప్‌ల నుండి కాల్‌లు చేయడానికి వినియోగదారులు డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుందని మాట్లాడుతున్నారు.

ప్రస్తుతం, వాట్సాప్ కాలింగ్ ఉచితం.అంటే మనం యాప్‌కి చేసే కాల్‌ల కోసం ఎటువంటి డబ్బు చెల్లించము.కానీ డేటా ఖర్చుగా చెల్లిస్తాము.
కానీ, ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొంది లైసెన్సింగ్ సదుపాయం వస్తే, వినియోగదారులు ఇంటర్నెట్ రుసుముతో పాటు యాప్‌ల కోసం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.ఈ ముసాయిదా బిల్లుపై టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రజల నుంచి సలహాలు కోరింది.