ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల కొత్త కొత్త వ్యాధులు వచ్చి ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.గత కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన కోవిడ్ కూడా చాలా ప్రమాదకరమైన వ్యాధి.
ఎందుకంటే ఈ వ్యాధికి ఇప్పటివరకు సరైన అందును కనుగొనలేదు.ఈ విషయం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే క్లోన్స్ అనే కొత్త వ్యాధి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఈ వ్యాధి ఎక్కువగా జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది.
సరైన ఆహారపు అలవాట్లు లేకుండా ఉండడం వల్ల క్రున్స్ వ్యాధి భారినప్పుడే అవకాశం ఉంది.
ఈ వ్యాధి జీర్ణాశయ కణజాలం ఎర్రబడేలా చేస్తుంది.ఇది కొంతమందిలో చాలా తక్కువగా, మరికొంతమందిలో బాగా ఎక్కువగా ఉంటుంది.
ఈ వ్యాధికి ఇప్పటివరకు పూర్తి చికిత్స అనేది లేదు.ఈ వ్యాధి లక్షణాలు తగ్గించేందుకు మాత్రం చికిత్స చేయవచ్చు.
ఈ వ్యాధిలో ఉండే లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం.పొత్తి కడుపులో తిమ్మిరిగా అనిపించడం, మలంలో రక్తం,అతిసారం, జ్వరం,ఆకలి లేకపోవడం,బరువు తగ్గడం,అలసట,తరచుగా పేగుల్లో తిప్పినట్టు అనిపించడం ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనిపిస్తే వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్లడం మంచిది.

అయితే ఈ వ్యాధి రావడానికి దారితీసే కొన్ని పరిస్థితులు ఉన్నాయి.రోగనిరోధక వ్యవస్థ, జీవనశైలి పరోక్షంగా దీని మీద ప్రభావం చూపే అవకాశం ఉంది.క్రోన్స్ వ్యాధి ఊపిరితిత్తులు, పేగు మార్గాన్ని రెండింటిని ప్రభావితం చేస్తుంది.ఈ వ్యాధి వల్ల ప్రేగులలో ఏర్పడే మంటని కాస్త తగ్గించుకోవచ్చు.ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.యాంటీ డైరియాల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఉపయోగించవచ్చు.
వ్యాధి నయం చెయ్యడానికి అవసరమైన రోగనిరోధక శక్తి పెరిగేందుకు సరైన ఆహార పదార్థాలను ఇస్తూ ఉండాలి.ఈ వ్యాధికి శస్త్ర చికిత్సలో GI ట్రాక్ట్ దెబ్బతిన్న భాగం తొలగించబడుతుంది.
శస్త్రచికిత్సలు దెబ్బతిన్న కణజాలాలను సరి చేసి ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి చేస్తారు.







