పిల్లలకు ప్రోటీన్ షేక్ ఇస్తున్నారా.. అయితే విషాన్ని ఇస్తున్నట్లే..?

ప్రస్తుత సమాజంలో పోషకాహారం ప్రాధాన్యం గురించి చాలా మంది ప్రజలకు తెలియడం లేదు.

పిల్లలు ( Children ) శరీరకంగా ఎదగడానికి, మానసికంగా అభివృద్ధి చెందడానికి ప్రోటీన్ ( Protein ) ఎంతో అవసరం అని వైద్యులు చెబుతున్నారు.

అయితే పిల్లలు తినే ఆహారం నుంచి తగినంత ప్రోటీన్ పొందుతారు.అయితే తల్లిదండ్రులు పిల్లలకు స్పెషల్ గా ప్రోటీన్ పౌడర్ కూడా ఇస్తూ ఉంటారు.

ఇది చాలామంది పిల్లలకు అవసరం లేదు.అధిక ప్రోటీన్లు పిల్లల బరువు పెరగడం, కిడ్నీ సమస్యలు, కాలేయా సమస్యలు, అజీర్ణ సమస్యలు, ఆర్గాన్ డామేజ్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్( Side Effects ) వంటివి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే వర్కౌట్స్ లేదా ఆటలు ఆడే పిల్లలకు ఇంకా ఎక్స్‌ట్రా ప్రోటీన్ అవసరమే లేదని చెబుతున్నారు.

Advertisement

బ్యాలెన్స్ ఫుడ్, ప్లాంట్ బెస్ట్ ఫుడ్స్ సాధారణంగా ప్రోటీన్ అవసరాలకు సరిపోతాయి.యనిమల్ ప్రోటీన్( Animal Protein ) మూత్రపిండాలు, గుండెకు హానికరం కాబట్టి వాటికి దూరంగా ఉండడమే మంచిదని చెబుతున్నారు.అయితే కొందరు మాత్రం మితిమీరిన న్యూట్రియన్స్ ఫుడ్స్, ప్రోటీన్ షేక్స్ తీసుకుంటూ ఉంటారు.

కొన్ని కంపెనీలు ఈ ప్రొడక్ట్స్ తో భారీ బిజినెస్ చేస్తూ ఉన్నాయి.అయితే వైద్యుల సలహా తీసుకోకుండా ప్రోటీన్ షేక్,( Protein Shake ) న్యూట్రియన్ మిక్స్, ఇతర సప్లిమెంట్స్ పిల్లలకు ఇవ్వడం ఎంతో ప్రమాదకరం అని చెబుతున్నారు.

అందుకే వీటికి బదులుగా మాంసం, గుడ్లు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, చేపలు, బీన్స్ వంటి ఆహారాలను పిల్లల డైట్ లో చేర్చితే వారికి ఎలాంటి ఇతర ప్రోటీన్స్ అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

ఈ సంవత్సరం ఆగస్టు నెలలో 16 ఏళ్ల రోహన్ గోదానియా( Rohan Godhania ) అనే బాలుడు ప్రోటీన్ షేక్ కారణంగా చనిపోయాడని డాక్టర్లు చెబుతున్నారు.ప్రోటీన్ షేక్ అమ్మోనియా స్థాయిలను ప్రమాదకర స్థాయిలో పెంచడంతో అబ్బాయి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.ఓటీసీ డెఫిషియన్సీ అనే అరుదైన జన్యుపరమైన రుగ్మత ఉన్నా రోహన్ ప్రోటీన్ షేక్ తాగి మరణించాడు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

ఈ రుగ్మత శరీరానికి అమ్మోనియాను ప్రాసెస్ చేయడం అంత సులభం కాదు.కాబట్టి చిన్నారులకు వీటిని అలవాటు చేయకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు