తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా పొగిడితే ప్రమాదమా..

ప్రస్తుత సమాజంలోని కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు.వారు చేసిన చిన్న పనులకి వారిని ఎక్కువగా మెచ్చుకుంటున్నారు.

 Is It Dangerous If Parents Praise Their Children Too Much Psychology Experts, Co-TeluguStop.com

అయితే చిన్నపిల్లలని పదేపదే పొగడడం వల్ల వారిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చైల్డ్ సైకాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎందుకంటే ఎక్కువగా పిల్లలను ప్రశంసించడం వల్ల ప్రాణాంతకమే కాకుండా వేధింపులకు గురయ్యేలా చేస్తుందని చెబుతున్నారు.

అతిగా పొగిడితే పిల్లలు కొన్ని సమయాల్లో కష్టమైనా పరిస్థితులను ఎదురుకోలేరని కొన్ని పరిశోధనలలో తెలిసింది.ఈ పరిశోధనలలో పాల్గొన్న 85% మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రశంసించడం వల్ల వారు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం పై ఆసక్తి చూపిస్తారు.

స్కూల్లో పిల్లలు బాగా చదవడానికి ఈ ప్రశంసలు ఎంతగానో ఉపయోగపడతాయి.కానీ అతిగా పొగిడితే మాత్రం అది వారిపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది.ఆరోగ్యకరమైన ప్రశంసకు, అతిగా పొగడడానికి మధ్య ఉన్న బేధాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే చాలా మంచిది.అలా అర్థం చేసుకున్నప్పుడు మితిమీరిన ప్రశంసల వల్ల పిల్లలపై పడే దుష్ప్రభావం నుంచి వారిని కాపాడుకోవచ్చు.

ఏదైనా పనిని సాధించడంలో పిల్లల కృషిని కచ్చితంగా ప్రశంసించి తీరాల్సిందే.చిన్నపిల్లలను ఏ చిన్న పని చేసినా ప్రశంసించ కూడదు.

మీ పిల్లలు గొప్ప పని చేసినప్పుడే ప్రశంసించాలి.సవాళ్ళను ఎదుర్కునే ధైర్యాన్ని పిల్లలకు ఇవ్వాలి.

పిల్లలను అతిగా పొగడడం వల్ల అనేక సమస్యలు రావచ్చు.చిన్నపిల్లలను మీ ఆలోచనలకు అనుగుణంగా వారిని మార్చడానికి ప్రశంస ఉపయోగపడుతుంది.

అంటే పిల్లలు ఎప్పుడైతే పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తారో అప్పటివరకు మాత్రమే ఈ పద్దతి పనికొస్తుంది.కానీ, అతిగా పొగడడం వల్ల పిల్లలు ప్రతిసారి తల్లిదండ్రులపై ఆధారపడవలసి వస్తుంది.ఈ పద్ధతి వారి మానసిక ఎదుగుదలకు అస్సలు మంచిది కాదు.తరచూ పిల్లల్ని మీరు ప్రశంసిస్తూ ఉంటే ప్రతి దానికి వారు ప్రశంసించాలని చూస్తూ ఉంటారు.తమదైన నిర్ణయం ఇలాంటి పిల్లలు అస్సలు తీసుకోలేరు.అందుకే ప్రశంసించే ముందు ఆలోచించడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube