తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిన పార్టీగా మలుచుకోనప్పటి నుండి కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.తెలంగాణ ఇచ్చినప్పుడు చూపిన అత్యుత్సాహం కారణంగా మొదటి దఫా ఎన్నికలో ఓడిపోయిన కాంగ్రెస్, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయడంలో కాంగ్రెస్ విఫలమవడంతో రెండో దఫా సార్వత్రిక ఎన్నికలలో కూడా సత్తా చాతుకోలేక పోయింది.
అయితే అప్పటి నుండి కాంగ్రెస్ కు ఘోర పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి.
దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ రంగంలోకి దిగినా దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి పాలైందన్న విషయం తెలిసిందే.
ఆ తరువాత గ్రేటర్ ఎన్నికలు ఇలా కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యతా లోపంతో ప్రజల్లో కాంగ్రెస్ పలుచబడిందని చెప్పవచ్చు.అయితే పార్టీ ప్రయోజనాల కంటే తమ వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే త్వరలో కార్పొరేషన్ సమరంలో కాంగ్రెస్ సత్తా చాటకపోతే ఇక కాంగ్రెస్ ను కాపాడాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది.కార్పొరేషన్ ఎన్నిక అనేది క్షేత్ర స్థాయి ప్రజల మనోభావాలకు అద్దం పట్టేది కావడంతో ఇక కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ కు అగ్ని పరీక్షలా మారిన పరిస్థితి ఉంది.
మరి ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.