నేటి సమాజంలో చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవారి వరకూ గూగుల్ ను వాడుతున్నారు.ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ గూగుల్ ను విపరీతంగా వినియోగిస్తున్నారు.
అందులో గూగుల్ ఫోటోస్ చాలా ప్రత్యేకమైనది.ఫోటోలు, వీడియోలను ఇందులో బ్యాకప్ గా ఉంచుకోవచ్చు.
చాలామంది గూగుల్ ఫోటోస్ లో తమ ఫోటోలను, వీడియోలను ఇంకా తమ డాక్యుమెంట్లను బ్యాకప్ గా ఉంచుకుంటారు.అయితే ఇదంతా కూడా గూగుల్ ఫోటోస్ లో ఉచితంగానే చేసుకోవచ్చు.
కానీ దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది.లిమిట్ దాటిన తర్వాత గూగుల్ ఫోటోస్ లో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ కావని తెలుసుకోవాలి.
గూగుల్ ఫోటోస్ లో కూడా 15gb కంటే ఎక్కువగా డేటాను దాచుకోలేము.అందులో ఉండేది కేవలం 15 gb స్టోరేజ్ మాత్రమే.
అంతకంటే ఎక్కువ స్టోరేజ్ తో ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు దాచుకోవాలంటే అందుకోసం అదనంగా సబ్ స్క్రిప్షన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది.

అందుకే మనకు అవసరమైన డేటాను ఉంచుకుని అవసరం లేని డేటాను ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తూ ఉండాలి.ఇలా చేయడం వల్ల అత్యంత విలువైన డేటాను మనం భద్రంగా ఉంచుకోవచ్చు.మనకు ఎన్నొ రకాల జీమెయిల్స్ వస్తాయి.
వాటిని ఆటోమేటిక్ గా డిలీట్ చేసేస్తే మనకు స్టోరేజ్ స్పేష్ బాగా ఉంటుంది.అవసరం లేనటువంటి మెయిల్స్ ను, డ్రైవ్ ఇన్ బాక్సును, లార్జ్ ఫైల్స్ ను ఏవిధంగా డిలీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
కొన్నిసార్లు మన మెయిల్ కు వచ్చే పెద్ద సైజు అటాచ్మెంట్లు మెయిల్ లో వస్తాయి.వాటిని ఒకేసారి తొలగించేందుకు మన జీమెయిల్ అకౌంట్ కి వెళ్లి సర్చ్ బార్ లో “ has:attachment larger:10M ”అని టైప్ చేస్తే సర్చింగ్ రిజల్ట్స్ మన ముందుకు వస్తాయి.వాటిలో అవసరం లేని మెయిల్స్ ను సెలక్ట్ చేసుకుని డిలీట్ చేస్తే సరి.ఒక వేళ 10 కంటే ఎక్కువగా పెద్ద ఫైళ్లు ఉంటే ఆ 10 స్థానంలో మీరు అనుకున్న నంబర్ ను ఉంచి సర్చ్ చేయండి.ఆ వచ్చిన వాటిలో మీకు ఏది వద్దో దానిని సెలక్ట్ చేసుకుని డిలీట్ చేసేయండి.ఆ తర్వాత ట్రాష్ లోకి వెళ్లి దానిని కూడా ఖాళీ చేసేయండి.
ఇలా చేయడం వల్ల మీ గూగుల్ ఫోటోస్ యాప్ లో స్టోరేజ్ ఎక్కువగా ఉండే అవకాశం లభిస్తుంది.