సమన్వయం మాటలకే పరిమితం అవుతుందా?

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో( Andhra Pradesh assembly elections ) ప్రభావం చూపాలని కలిసికట్టుగా ముందడుగు వస్తున్న జనసేన తెలుగుదేశం పార్టీలు కార్యకర్తల సమన్వయం కోసం జిల్లా స్థాయి మీటింగులు పెట్టుకొని ఉమ్మడి కార్యాచరణ ప్రకటించాయి.

ఇప్పటికే రెండు పార్టీల తరఫున కీలకమైన కమిటీలను ఏర్పాటు చేసుకొని ఈ సమన్వయం బాధ్యతలను ఆయా నాయకులపై పెట్టారు.

అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సమన్వయ బేటీ లు గ్రౌండ్ లెవెల్ లో అంత సత్ఫలితాలను ఇవ్వడం లేదని తెలుస్తుంది .

ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిపై ఏ విషయమూ తేల్చకపోవడం సీట్ల కేటాయింపులు కూడా ఇంకా జరగకపోవడంతో ఇరు పార్టీల మధ్య సఖ్యత కేవలం మాటలకే పరిమితం అవుతుందని తెలుస్తుంది.ముఖ్యంగా తమ తమ సీట్లను వదులుకోవడానికి రెండు పార్టీల నుంచి ముఖ్య నాయకులు సిద్ధంగా లేకపోవడంతో అధిష్టానం చెబుతున్న సమన్వయం వీరి మధ్య ఉండటం లేదని ఒకరికొకరు అనుమానంతో చూసుకుంటూ అభద్రతాభావంతోనే ఉంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఈ రెండు పార్టీలు( TD, Jana sena ) కలిసి నడిస్తే తప్ప విజయం సాధించడం కష్టమని అధిష్టానాలు ఆలోచిస్తుంటే ఇంతకాలం కష్టపడిన సీటును ఎందుకు కోల్పోవాలన్న ఆందోళనలో స్థానిక నాయకులు ఉండటంతో ఈ ఇరు పార్టీల నాయకుల లోనూ అధిష్టానాలు ఆశిస్తున్న ప్రయోజనం నెరవేరటం లేదని తెలుస్తుంది .

అయితే సీట్ల కేటాయింపులు పూర్తిచేసి ఈ భేటీలు నిర్వహిద్దామని ఆలోచన కూడా చేసినా అప్పుడు రెబల్అభ్యర్థులు పెరిగే కొత్త సమస్యలు పెరిగి అవకాశం ఉంది అని అది అంతిమంగా అధికార వైసిపికి లాబించే అవకాశం ఉందని ఆలోచనతోనే కేటాయింపులు చెయ్యదానికి ఇరుపార్టీ లు వాయిదా వేస్తున్నాయి.ఏదేమైనా చూస్తుంటే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు అంత సులువుగా ఒక కొలిక్కి వచ్చేటట్టు కనిపించడం లేదు .కొన్నిచోట్ల రెండు పార్టీలకు బలమైన అభ్యర్థులు ఉండటంతో పాటు ఆయా సామాజిక వర్గాలకు బలమైన ఓటు బ్యాంకు కూడా ఉండడంతో తమకంటే తమకంటూ బాహా బాహీ కి తలపడే వాతావరణం కూడా ఏర్పడవచ్చు అని అంచనాలు ఉన్నాయి.మరి చూస్తుంటే సీట్ల సర్దుబాటు ఈ రెండు పార్టీలకు అతి పెద్ద టాస్క్ గా అవతరించే అవకాశం కనిపిస్తుంది .

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు