నల్లగొండ జిల్లా మునుగోడు నియోజక వర్గం ఓటర్లు ఫిక్స్ అయిపోయారు.తమ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని.
నియోజక వర్గంలో మళ్లీ ఎన్నికలు వస్తాయని మెంటల్ గా కూడా సన్నద్ధమయ్యారు.ఏ నియోజకవర్గ ప్రజలు అయినా… ప్రభుత్వమైనా… ఎన్నికలు రావొద్దని కోరుకుంటాయి.
కానీ మునుగోడు నియోజకవర్గ ప్రజలు మాత్రం మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు.ఎన్నికలనే కోరుకుంటున్నారు.
ప్రభుత్వం కూడా ఎన్నికలనే కోరుకుంటుంది.ప్రజా ప్రతినిధులు కూడా ఎన్నికలనే అడుగుతున్నారు.ఇందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి.ప్రస్తుతానికైతే… మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.గత కొంతకాలంగా ఆయన పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఢిల్లీలో ఇటీవల బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలువడంతో… రాజగోపాల్ కమలం గూటికి చేరుతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.
ఇదే సమయంలో మునుగోడు ప్రజలు కొత్త వాదాన్ని ఎత్తుకున్నారు.మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండని… ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నచ్చజెపుతున్నారట.రాజీనామా చేస్తే నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు వస్తాయని.దీంతో కేసీఆర్ సర్కారు ఇక్కడ భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని … ఇందుకు గత హుజూరాబాద్ ఎన్నికలను ఉదహరణగా చెబుతున్నారు.
తెలంగాణలో జరిగిన హుజూరాబాద్బై ఎలక్షన్ దేశంలోనే అత్యంత భారీ ఖర్చుతో జరిగిన ఎన్నికలుగా చెప్పుకుంటారు.బై ఎలక్షన్వస్తేనే.మునుగోడు నియోజకవర్గంలో సర్కారు పెద్ద మొత్తంలో నిధులను వెచ్చించి… అభివృద్ధి పనులను చేపడుతుందని భావిస్తున్నారు.ఇన్నాళ్లూ తమ ఊరి వైపు కన్నెత్తి చూడని ఆఫీసర్లు, లీడర్లు ఎన్నికల ముందు తమ ఇంటికే వచ్చి సమస్యలను అడిగి పరిష్కరిస్తారని అంటున్నారు.
ఎమ్మెల్యే రాజీనామా చేసిన మరుక్షణం నుంచి నియోజకవర్గానికి పండుగ మొదలైతదని, తమకు వ్యక్తిగత ప్రయోజనాలతోపాటు నియోజకవర్గంలోని పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని చెప్పుకుంటున్నారు.రాత్రికి రాత్రే రోడ్లు వేస్తారని, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు కడ్తారని, కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, గొర్రెలు, దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇలా అన్ని స్కీములు ఇస్తారని చెబుతున్నారు.
ఇన్నాళ్లు ముఖం చాటేసిన ప్రజాప్రతినిధులు కూడా తమను వెతుక్కుంటూ వస్తారని, అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు పోటీపడి మరీ ఓటు కింత అని పంచుతారని అంటున్నారు.మందు, విందులతో దావత్‌లు ఇస్తారని కూడా మునుగోడు ఓటర్లు చర్చించుకుంటున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో ఎన్నో పనులు పెండింగ్ లో ఉన్నాయని… ఇక్కడ ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కట్టలేదంటున్నారు.850 ఇండ్లకు టెండర్లు పిలిస్తే కేవలం 100 ఇండ్ల నిర్మాణానికే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారని చెబుతున్నారు.అందులోనూ ఒక్క దానికీ పని స్టార్ట్ కాలేదని… ఎన్నికలు వస్తే తమకు డబుల్బెడ్రూం ఇండ్లు వస్తాయని జనం అనుకుంటున్నారు.మర్రిగూడ మండలంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ కట్టి మూడేండ్లయినా ఓపెన్చేయలేదు.
ఒకవేళ ఎన్నికలు వస్తే ఈ 30 బెడ్స్హాస్పిటల్ ఓపెన్‌చేసి, డాక్టర్లను ఇస్తారని జనం అనుకుంటున్నారు.చౌటుప్పుల్, మునుగోడు మధ్య రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయాయి.మునుగోడు – నారాయణ్‌పూర్ మధ్య రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది.అవన్నీ మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే….
కేసీఆర్ సర్కారు… గెలుపు కోసమైనా భారీగా నిధులు వెచ్చించి పనులను పూర్తి చేస్తుందని ఓటర్లు అంటున్నారు.