ఒక డైరెక్టర్ ఒక సినిమా మొదలు పెడితే ఆ సినిమా పూర్తయి విడుదలయ్యే వరకు టెన్షన్ అనేది తప్పనిసరి.ఎందుకంటే మధ్యలో ఏమైనా సమస్యలు వచ్చి షూటింగ్ ఆగిపోవడం, నటులకు అనారోగ్యం లేదా ఇతర సినిమాలకు డేట్స్ ఇవ్వడం లాంటివి జరగటం వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ వస్తూ ఉంటుంది.
అందుకే కొంతమంది దర్శకనిర్మాతలు ముందుగానే షెడ్యూల్ పూర్తి చేసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు కీర్తి సురేష్( Keerthy Suresh ) వల్ల చిరంజీవి సినిమాకు సమస్య వచ్చినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం చిరంజీవి బోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు మెహర్ రమేష్( Meher Ramesh ) దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా మధ్యలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తుంది.ఈ సినిమా విడుదలకు ఆగస్టు 11 అని డేట్ ప్రకటించారు.
దీంతో మూడు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ కూడా షూటింగ్ షెడ్యూలు కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.
కానీ షూటింగ్ పనులు మాత్రం మెల్లగా నడుస్తున్నట్టు తెలుస్తుంది.చిరంజీవి మాత్రం ఎప్పటికప్పుడు షూటింగ్లో పాల్గొంటూనే ఉన్నాడు కానీ.కాంబినేషన్ డేట్ లు మాత్రం కలిసి రావటం లేదు.
దీని వల్ల సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది.అంటే చిరంజీవి, కీర్తి సురేష్( Chiranjeevi, Keerthy Suresh ) తో చేయాల్సిన సన్నివేశాలు ఆలస్యం అవుతున్నాయని తెలుస్తుంది.
దీనికి కారణం కీర్తి సురేష్ అని తెలుస్తుంది.ఎందుకంటే కీర్తి సురేష్ వేరే భాషలో ఓ కీలకమైన సినిమాకి ఒప్పుకుందట.దీనివల్ల చిరంజీవి సినిమాకు డేట్లు క్లాష్ అవుతున్నాయని అంటున్నారు.ఇలాగే జరిగితే సినిమా మరి మూడు నెలలు కాదు ఇంకా సమయం పడుతుందని అనుమానాలు వస్తున్నాయి.