అకాల వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారని మాజీమంత్రి సోమిరెడ్డి అన్నారు.రైతులు నష్టపోతుంటే ఆదుకునే తీరిక వ్యవసాయ శాఖ మంత్రికి లేదని విమర్శించారు.
వ్యవసాయ శాఖ మంత్రికి దోచుకోవడం… దాచుకోవడంతోనే సరిపోతుందని సోమిరెడ్డి ఆరోపించారు.రైతుల కోసం రూ.1.46 కోట్లు ఖర్చు చేశామని అబద్దాలు చెప్తున్నారన్నారు.సీఎం, మంత్రుల దృష్టి సీబీఐ కేసుల నుంచి బయటపడటంపైనే ఉందని తెలిపారు.రైతులను పట్టించుకునే నాథుడే లేరని మండిపడ్డారు.







