వచ్చే ఎన్నికలతో మిత్రులతో చాలా అవసరం ఉంటుందని భావిస్తున్న బారతీయ జనతా పార్టీ( BJP party ) అందుకు కొత్త మిత్రుల అన్వేషణ లో వేగంగా అడుగులు వేస్తుంది.గతంలో ఎన్డీఏల్లో కూటమి గా ఉన్న పార్టీలతో పాటు జనసేన లాంటి కొత్త పార్టీలను జట్టులో చేర్చుకొని వచ్చే ఎన్నికలకు సిద్దమవ్వాలని చూస్తున్న భాజపా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక ఫార్ములా ను అమలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
విడిగా చూస్తే నోటా కి ఉన్న బలం కూడా లేని భారతీయ జనతా పార్టీ సినిమాటిక్ చరిష్మా బలంగా ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఒక కీలకవర్గ కీలక సామాజిక వర్గం మద్దతు పుష్కలంగా ఉన్న జనసేన అదినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ని అడ్డుపెట్టుకొని రాజ్యాధికారంలో వాటా కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా రాజకీయ పరిశీలకు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఒక స్పష్టమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకున్నదని, ఆర్థికంగా కూడా ఈసారి ఎన్నికలలో ఆ పార్టీ బలంగా ఖర్చు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒంటరిగా వెళ్లి రిస్క్ తీసుకోవటం అనవసరమైన భావిస్తున్న చంద్రబాబు జనసేనతో పొత్తులు తమకు కచ్చితంగా కలసి వస్తాయని చాలా నమ్మకంతో ఉన్నారు.ఇదే పాయింట్ను తమ కనుకూలంగా మార్చుకొని అధికారంలో వాటా కోసం భాజపా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది.మొదటి నుంచి జనసేన( Jana sena ) తమ మిత్రపక్షమని బలం గా చెప్పుకుంటున్న బాజాపా ఇప్పుడు పవన్ ను ఢిల్లీకి పిలిపించుకుని , రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో తమ అవసరం తెలుగుదేశానికి ఎంతగానో ఉన్నందున జనసేన బిజెపి కూటమికి రాజ్యాధికారంలో వాటా వచ్చేటట్టుగా తెలుగు దేశం పై ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహాన్ని అమలు చేసే ప్రతిపాదన పెట్టబోతునట్టుగా తెలుస్తుంది .
కనీసం బిజెపి- జనసేనకూటమికి 75 అసెంబ్లీ సీట్లను 10 పార్లమెంట్ సీట్లను డిమాండ్ చేయాలనే ఉద్దేశంతో కమలనాథులు ఉన్నట్లుగా తెలుస్తుంది .అయితే వాస్తవ పరిస్థితులపై కచ్చితమైన సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్న జనసేన అదినేత తమకు బలం ఉన్నచోట మాత్రమే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నందున భాజపా ఫార్ములాకు ఎంతవరకు జనసేన ని ఒప్పుకుంటారన్నదే ప్రశ్నగా మారింది.అంతే కాకుండా జగన్ ని గద్దె దించడమే తన మొదటి ప్రయారిటీ గా బావిస్తున్న పవన్ మరి బాజాపా ప్రతిపాదనకు అంగీకరిస్తారో లేదో వేచి చూడాలి .