కర్నాటకలో( Karnataka election ) అధికార బీజేపీ ఏం చేస్తోందో.ఎందుకు చేస్తోందో ఆ పార్టీ నేతలకు కూడా అర్థంకానీ పరిస్థితి.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పార్టీ హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికి అంతుచిక్కడం లేదు.అధికారమే లక్ష్యం అని చెబుతున్నా కమలం పార్టీ ఇలా ఎందుకు చేస్తోందని ఇవెన్ సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం అఃదికరంలో ఉన్న బీజేపీ.మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.
అందుకు తగ్గట్టుగానే అభ్యర్థులను ఎన్నుకుంటూ వ్యూహ రచన చేస్తోంది.అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

అభ్యర్థుల ఎంపిక విషయంలో హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో అంతుబట్టడం లేదు.ఓవైపు కాంగ్రెస్, జేడీఎస్( JDS ) వంటి పార్టీలు అభ్యర్థులను ముందే ప్రకటించగా.బీజేపీ( BJP ) మాత్రం నిదానమే ప్రధానం అనే దొరణినే పాటిస్తూ వచ్చింది.ఎట్టకేలకు తాజాగా మూడవ అభ్యర్థుల జాబితాను ప్రకటించి గెలుపు గుర్రాలను ఫైనల్ చేసింది.
కర్నాటకలోని 224 స్థానాలకు గాను మొదటి జాబితాలో 189 మందిని, రెండవ జాబితా లో 23 మందిని ఇక తుది జాబితాలో 10 మందిని ప్రకటించింది.అయితే ప్రకటించిన మూడు జాబితాల్లో కూడా సీనియర్స్ కు మొండి చేయి చూపించింది.

దీంతో సీనియర్స్ విషయంలో బీజేపీ ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తోంది ? పూర్తి స్థాయిలో కొత్తవారిపైనే ఆధారపడి కమలం పార్టీ రిస్క్ చేస్తోందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అయితే పార్టీలోని చాలమంది సీనియర్ నేతలను పక్కన పెట్టడానికి బలమైన కారణమే ఉందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.ప్రస్తుతం అధికార బీజేపీ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత గట్టిగానే ఉంది.ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంతా ఆయా నియోజికవర్గాల వారీగా ఉన్న ఎమ్మెల్యేలాపైనే అనేది బీజేపీ అధిష్టానానికి అందిన సమాచారమట.
అందుకే ఈసారి ఎన్నికల్లో యాబై శాతానికి పైగా కొత్తవారికే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.సీట్లు దక్కని సీనియర్స్ పార్టీ వీడతారని తెలిసినప్పటికి కొత్తవారికే ఎక్కువ ఛాన్స్ ఇచ్చి బీజేపీ రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చాలమంది సీనియర్ నేతలు పార్టీ వీడి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.మరి కొత్తవారితో కమలం పార్టీ చేస్తున్న రిస్క్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.







