బీజేపీ( BJP ) ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో అర్థం కానీ పరిస్థితి.ఏ పార్టీతో సక్యతగా మెలుగుతుందో.
ఏ పార్టీని దూరం పెడుతుందో విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదు.నిన్న మొన్నటి వరకు ఏపీలో వైసీపీతో కొంత స్నేహపూర్వకంగా ఉన్న బీజేపీ.
హటాత్తుగా ప్లేట్ మార్చి వైసీపీపై వార్ డిసైడ్ చేసింది.అలాగే గత ఎన్నికల తరువాత నుంచి టిడిపిని ( TDP )దూరం పెడుతూ వచ్చి ఇప్పుడు ఆ పార్టీకే దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.
దీంతో బీజేపీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో ఊహలకే అందని విధంగా ఉంది.అయితే ఇదే కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ను కాషాయ పార్టీ తెలంగాణలో కూడా అమలు చేయబోతుందా అంటే అవునేమో అనే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

గత కొన్నాళ్లుగా తెలంగాణలో బీజేపీ బిఆర్‌ఎస్( Brs ) మద్య దోస్తీ కుదిరిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ వార్తలను రాష్ట్ర బీజేపీ నేతలు కొంత ఖండిస్తున్నప్పటికి అంతర్గతంగా పొత్తు కుదిరిందనేది.ఇరు పార్టీల ప్రస్తుత వైఖరిని చూస్తే ఇట్టే అర్థమౌతుంది.ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda )రేపు తెలంగాణకు రానున్నాడు.
ఈయన రాక కోసం ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు( Telangana BJP Leaders ) గట్టి ఏర్పాట్లు చేశారు.అయితే తెలంగాణకు రానున్న నడ్డా ప్రస్తుత పరిస్థితులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఆ మద్య ఏపీలో వెళ్ళిన నడ్డా అక్కడి జగన్ ప్రభుత్వంపై ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరం చూశాం.ఇప్పుడు తెలంగాణకు వస్తుండడంతో కేసిఆర్ సర్కార్ పై నడ్డా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది చూడాలి.అయితే బీజేపీ బిఆర్‌ఎస్ మద్య పొత్తు ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ పై గాని, కేసిఆర్ పైగాని ఎలాంటి వ్యాఖ్యలు చేసిన పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు దారి తీసే అవకాశం ఉంది.అయితే బిఆర్‌ఎస్ పై బీజేపీ అధిష్టానం విమర్శలు చేయడం సర్వసాధారణం.
ఒకవేళ ఎలాంటి విమర్శలు చేయకుండా అసలు బిఆర్‌ఎస్ ప్రస్తావన లేకుండా నడ్డా తన ప్రసంగాన్ని ముగించిన.పొత్తు కన్ఫర్మ్ అనే వాదన బలపడే అవకాశం ఉంది.మరి నడ్డా రేడు ఎలాంటి కన్ఫ్యూజన్ పాలిటిక్స్ కు తెరతీస్తాడో చూడాలి.







