తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య భీకర మాటల దాడి జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే బీజేపీ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ టీఆర్ఎస్ పై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత తీసుకరావాలనే ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
అయితే చాలా వరకు టీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి బీజేపీ హవా కొనసాగే వాతావరణాన్ని సృష్టించాలనేది బీజేపీ అంతిమ లక్ష్యం.లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ ను వెనక్కి నెట్టడం అంత సులభమేమీ కాదు.
ఎందుకంటే బీజేపీ పార్టీ క్షేత్ర స్థాయిలో అంతగా ప్రజల్లోకి వెళ్లలేదు.అంతేకాక బీజేపీకి తెలంగాణలో అంతగా కార్యకర్తల బలం కూడా లేనటు వంటి పరిస్థితి ఉంది.
అందుకే బీజేపీ మరింత దూకుడుగా ముందుకెళ్తూ టీఆర్ఎస్ ను మరింతగా ఇరకాటంలోకి నెడుతోన్న పరిస్థితి ఉంది.

అందుకే టీఆర్ఎస్ కూడా చాలా దూకుడుగా పోరాటాలు, నిరసనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ నిరసనలు ,బీజేపీ దూకుడు నిర్ణయాలతో ఇంకా ఎన్నికలు రాకముందే ఎన్నికల వాతావరణం అనేది సృష్టిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇటువంటి పరిణామాల వల్ల ముందస్తు ఎన్నికలు వచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే ముందస్తు ఎన్నికల అంశం ఇప్పుడు చర్చించుకోవడం అంతగా ప్రాధాన్యత లేదు కాబట్టి ఒకవేళ అటువంటి పరిస్థితులు వచ్చినా ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరమైన అంశం. అమిత్ షా ఇప్పటికే దృష్టి కేంద్రీకరించిన పరిస్థితుల్లో రానున్న రోజుల్లో బెంగాల్ తరహా పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఎందుకంటే అమిత్ షా దృష్టి పడ్డాక ఎంతో కొంత విభిన్న పరిణామాలు మాత్రం జరుగుతూ ఉంటాయనేది మాత్రం సుస్పష్టం.మరి బీజేపీ, టీఆర్ఎస్ దూకుడు రాజకీయంగా ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందనేది చూడాల్సి ఉంది.