మొన్నటి వరకు బిజెపిపై సానుకూలంగా ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.తాము బిజెపితో పొత్తు కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా పట్టించుకోకపోవడం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తనను అరెస్టు చేయడం వెనక బిజెపి పెద్దల హస్తం ఉందని అనుమానాలు బాబులో బాగా బలపడ్డాయి.
అందుకే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చంద్రబాబు ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చారట.జైలులో గడిపిన 53 రోజుల్లో 2024 ఎన్నికల్లో ఏవిధంగా గెలవాలనే వ్యవహారాలపైనే సీరియస్ గా లెక్కలు వేసుకున్నారట.
అంతకంటే ముందుగా తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి దూరంగా ఉండటంతో పాటు, ఆ పార్టీ అధికారంలోకి రాకుండా చేసేందుకు, అలాగే అన్ని విషయాల్లోనూ వైసీపీ ప్రభుత్వానికి సహకారం అందిస్తున్న బీఆర్ఎస్ ( BRS )ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టేందుకు పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు బాబు సిద్ధమయ్యారు .

అందుకే తెలంగాణలో టిడిపి ( TDP )పోటీకి దూరంగా ఉండడానికి కారణమట.ఈ విషయంలో తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ ( Kasani Gnaneshwar )ఎంత ఒత్తిడి చేసినా బాబు తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దూరంగా ఉంచడానికి కారణం ఇదేనట.తెలంగాణలో టిడిపి పోటీ చేస్తే కచ్చితంగా ఓట్ల చీలిక వస్తుందని అది బీఆర్ఎస్ బిజెపిలకు లాభం చేకూరుస్తుందని అంచనాకు వచ్చిన బాబు ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.

ఎన్నికల్లో టిడిపి పోటీకి దూరంగా ఉంటే అది కాంగ్రెస్ కు మేలు జరుగుతుందని, పరోక్షంగా తెలంగాణ టిడిపి అభిమానులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని ,దీని ద్వారా తమకు ప్రధాన శత్రువులుగా ఉన్న బీఆర్ఎస్ తో పాటు బిజెపిని దెబ్బ కొట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని బాబు( Chandrababu ) నిర్ణయించుకునే ఈ నిర్ణయం తీసుకున్నారట.అందుకే ఏపీలో తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో బిజెపి( Telangana BJP )కి మద్దతు ఇస్తున్న తెలంగాణ టిడిపి మాత్రం ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి సైతం మద్దతు ఇవ్వకుండా పరోక్షంగా కాంగ్రెస్ ను గెలిపించే వ్యూహానికి సిద్ధమైందట.







