Venkatesh : ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిని వెంకటేష్ కూతురు పెళ్లి చేసుకుంటుందా..?

చాలామంది సెలబ్రిటీల పిల్లలు పెళ్లిళ్లు చేసుకునే సమయంలో కొంతమంది తల్లిదండ్రులకు నచ్చిన వారిని చేసుకుంటే మరి కొంతమంది వారు ప్రేమించిన వారిని చేసుకుంటారు.అయితే ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సెలబ్రిటీ ల ఇళ్లల్లో పెళ్లి భాజాలు వరుసగా మోగుతున్నాయి.

 The Person Who Is Supposed To Marry That Heroine Is Marrying Venkateshs Daughte-TeluguStop.com

అలా ఇప్పటికే మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ లావణ్య ( Varun tej,Lavanya ) ల పెళ్లి జరిగిపోయింది.ఇక రీసెంట్ గా దగ్గుబాటి ఫ్యామిలీలో కూడా పెళ్లి భాజాలు మోగాయి.

దగ్గుబాటి వెంకటేష్ తన రెండో కూతురు హయవాహిని కి గ్రాండ్ గా నిశ్చితార్థం చేశారు.అలాగే యాక్షన్ హీరో అర్జున్ కూడా తన కూతురు ఐశ్వర్య కి ఎంగేజ్మెంట్ చేశారు.

ఇక త్వరలోనే మిల్కీ బ్యూటీ కూడా పెళ్లికి సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇదంతా పక్కన పెడితే దగ్గుబాటి వెంకటేష్ ( Daggubati Venkatesh ) తన కూతురు హయవాహిని కి ఆకాష్ అనే గైనకాలజిస్ట్ ని ఇచ్చి పెళ్లి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఇప్పటికే ఇరు కుటుంబాలు అన్ని మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా చేయించారు.అయితే ఆకాష్ ముందుగా పెళ్లి చేసుకోవాల్సింది వెంకటేష్ కూతుర్ని కాదట.

మరో హీరోయిన్ నట.

Telugu Aishwarya, Akash, Arjun, Gossip, Hayavahini, Nagababu, Niharika, Varun Te

కానీ ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడం వల్ల వెంకటేష్ కూతురిని చేసుకునే అవకాశం వచ్చింది అని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.మరి వెంకటేష్ కాబోయే అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన ఆ హీరోయిన్ ఎవరు.ఆమె ఎందుకు రిజెక్ట్ చేసింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

వెంకటేష్ కి కాబోయే అల్లుడు ఆకాష్ ( Akash ) గైనకాలజిస్టుల్లో మంచి పేరున్న డాక్టరట.అంతేకాదు ఈయన నెల సంపాదన స్టార్ హీరోల కంటే ఎక్కువగా ఉంటుందని,కోట్లలో సంపాదిస్తారని అలాగే సంపాదనకు మించి ఈయనకు ఎన్నో మంచి గుణగణాలు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే ముందుగా ఆకాష్ పెళ్లి చేసుకునేది హయవాహిని ( Hayavahini ) ని కాదట.నాగబాబు కూతురు నిహారికనట.మొదట నిహారిక కి ఆకాష్ ని ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు భావించినప్పటికీ నిహారికకి డాక్టర్ని పెళ్లి చేసుకోవడం నచ్చకపోవడంతో ఆయనను రిజెక్ట్ చేసి జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది.

Telugu Aishwarya, Akash, Arjun, Gossip, Hayavahini, Nagababu, Niharika, Varun Te

కానీ వీరి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు.అలా నిహారిక కాదనడంతో ఆకాష్ ఫ్యామిలీ దగ్గుబాటి వెంకటేష్ కూతురిని ఆయనకు ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు.అలా నిహారిక ( Niharika ) చేసుకునే అబ్బాయిని హాయ వాహిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త గుప్పుమంది.

మరి వైరల్ అయ్యే ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో మాత్రం తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube