ఏపీలో రాజకీయ పార్టీలన్నీ కేంద్ర అధికార పార్టీ బిజెపి చెప్పుచేతుల్లో ఉన్నాయని, బీజేపీకి మద్దతు ఇవ్వడం మినహా ఆ పార్టీని విమర్శించే అంతటి సాహసం ఏ పార్టీ చేయలేకపోతున్నట్టుగానే వ్యవహారం కనిపిస్తోంది.ప్రస్తుత ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన పార్టీల పరిస్థితి ఇదే విధంగా ఉంది.
ప్రస్తుతం ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి.ఇక వైసిపి అధికారకంగా పొత్తు పెట్టుకోకపోయినా మద్దతుగా నిలబడుతోంది.
ఏపీ బీజేపీ నేతలు వైసీపీ ని టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా, బీజేపీని పల్లెత్తు మాట అనలేని పరిస్థితి వైసిపి కి ఉంది.కేవలం ఏపీ బిజెపి నేతలపై విమర్శలు చేస్తూ, కౌంటర్ ఇచ్చి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, కేంద్రాన్ని గట్టిగా నిలదీసేందుకు వైసిపి నాయకులు ఇష్టపడడం లేదు.ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీధీ అదే పరిస్థితి.
2014 ఎన్నికల్లో బిజెపితో – టిడిపి పొత్తు పెట్టుకున్నా.ఆ తర్వాత కొంతకాలానికి ఆ పొత్తు రద్దు చేసుకుని కొంత కాలం పాటు విమర్శలు చేసింది.ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపొయింది.2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి ఎన్నో రకాలుగా ప్రయత్నించినా, ఆ పార్టీ నేతలు ఎవరు టీడీపీ ని దగ్గర చేసుకునేందుకు ఇష్ట పడలేదు.ఇది బీజేపీకి అనుకూలంగా మారింది.
ఏపీ లోని ప్రధాన పార్టీల బలహీనతను వాడుకుంటూ బిజెపి తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటోంది.ఇక వైసీపీతో ఉన్న రాజకీయ అవసరాల దృష్ట్యా కేంద్ర బిజెపి పెద్దలు సందర్భం వచ్చినప్పుడల్లా జగన్ పరిపాలన మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అలాగే జగన్ కు తమ అపాయింట్మెంట్ ఖరారు చేస్తూ, కోరిన కోరికలన్నీ నెరవేరుస్తున్నారు.ఇక ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది.కేంద్రం పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరలు పెంచుకుంటూనే వెళ్తున్నా దానికి కారణం వైసీపీని అన్నట్లుగా విమర్శలు చేస్తోంది.బిజెపి ని విమర్శించేందుకు ఆ పార్టీ సాహసం చేయడం లేదు .విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ బిజెపి పై విమర్శలు చేయకుండా పూర్తిగా వైసీపీ ని టార్గెట్ చేసుకుంటూ ఆ పార్టీ నాయకులు విమర్శలు చేశారు.

ఇక సందర్భం వచ్చినప్పుడల్లా ఏపీ బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా వాటిని పట్టించుకోనట్టు గానే వ్యవహరిస్తూ వస్తున్నారు.ఇక ఏపీలో బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన పరిస్థితి ఇదే విధంగా ఉంది.జనసేనను బీజేపీ పట్టించుకోనట్టు గాని వ్యవహరిస్తున్నా, బిజెపితో పొత్తు రద్దు చేసుకునే సాహసం ఆ పార్టీ చేయలేకపోతోంది.
ఈ విధంగా మిత్రపక్షం వ్యతిరేక పక్షం అనే తేడా లేకుండా ఏపీ లోని ప్రధాన రాజకీయ పార్టీల బలహీనతలను బిజెపి వాడుకుంటున్నట్టు గానే కనిపిస్తోంది.