బుల్లితెరపై టాప్ యాంకర్ ఎవరనే ప్రశ్నకు యాంకర్ సుమ పేరు సమాధానంగా వినిపిస్తుంది.ఒక్కో ఈవెంట్ కు సుమ 3 నుంచి 4 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
టీవీ షోలకు కూడా సుమ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఏ షో చేసినా ఆమె లక్ష రూపాయల కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకోరని సమాచారం అందుతోంది.బుల్లితెరపై ఉండే క్రేజ్ వల్ల సుమ జయమ్మ పంచాయితీ సినిమాతో వెండితెరపై అదృష్టం పరీక్షించుకున్నారు.
అయితే జయమ్మ పంచాయితీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదు.ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే జయమ్మ పంచాయితీ ఫ్లాప్ కావడంతో సుమ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.బుల్లితెరపై క్లిక్ అయిన సుమ వెండితెరపై మాత్రం సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయారు.
బుల్లితెరపై స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న సుమ జయమ్మ పంచాయితీ హిట్టైతే మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకున్నారు.అయితే కరోనా థర్డ్ వేవ్ తర్వాత సినిమాలను చూసే విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారడంతో జయమ్మ పంచాయితీ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.
ఈ సినిమా రిజల్ట్ వల్ల సినిమాల్లో నటనకు సుమ పూర్తిగా గుడ్ బై చెప్పేసినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దర్శకనిర్మాతలు కొత్త స్క్రిప్ట్ లతో సంప్రదిస్తున్నా సుమ ఆ సినిమాలను సున్నితంగా తిరస్కరిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.సినిమా ఫంక్షన్లకు, టీవీ షోలకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించాలని సుమ భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఎంతోమంది యాంకర్లు ఎంట్రీ ఇస్తున్నా సుమకు గట్టి పోటీ ఇవ్వడంలో వాళ్లు ఫెయిలవుతున్నారు.
ఇప్పట్లో సుమకు గట్టి పోటీనిచ్చే యాంకర్ లేనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







