పెళ్లికి అలియా భట్ ఒప్పుకోవడం లేదా.. అందుకే ఆ ఈవెంట్ లో ప్రజల ముందు అడిగాడా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో హీరోయిన్లు ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రేమలో ఉన్న ఈ జంటలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతూ వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రేమ పక్షులు విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్ డిసెంబర్ 9 వ తేదీన ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని వారి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది మరొక జంట కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ జంట ఈ ఎడాది వారి వివాహాన్ని రద్దు చేసుకొని వచ్చే ఏడాది ప్లాన్ చేసినట్లు సమాచారం.ఇలా తమ పెళ్లిని వాయిదా వేసుకున్న ప్రేమజంట మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ రణబీర్ కపూర్- అలియా భట్.

వీరిద్దరూ ఈ ఏడాది చివరిలో వివాహం చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే చివరికి ఈ ఏడాది వీరి వివాహం చేసుకోవడంలేదని తేల్చి చెప్పారు.

Advertisement

ఇక ఈ ఏడాది వీరి పెళ్లి జరగకపోవడంతో వీరిద్దరు సినిమాలపై దృష్టి పెట్టారు.ఈ క్రమంలోనే రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన సినిమా "బ్రహ్మాస్త్ర".

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల వేడుకలో భాగంగా ఈ జంట మీడియా తో సరదాగా ముచ్చటించారు.

ఈ వేడుకల్లో భాగంగా ఈ జంటపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించడం మరికొందరు ఒక పేపర్లో వీరికి ప్రశ్నలు రాసి ఇవ్వగా వాటిని చదువుతూ ఆ ప్రశ్నలకు రణబీర్ సమాధానాలు చెప్పారు.ఈ వేడుకలో భాగంగా రణబీర్ కు మీడియా నుంచి, అభిమానుల నుంచి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురయింది.

ఈ క్రమంలోనే రణబీర్ కపూర్ ఈ ప్రశ్నకు ఊహించని విధంగా సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా రణబీర్ కపూర్ మాట్లాడుతూ గత ఏడాది నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

నాకు కూడా పెళ్లి చేసుకుని జీవితంలో సంతోషంగా గడపాలని ఉంది.మరి మన పెళ్లి ఎప్పుడు అంటూ అలియా భట్ వైపు చూసి మాట్లాడారు.

Advertisement

ఇలా రణబీర్ కపూర్ తన వైపు చూసి మన పెళ్లి ఎప్పుడు అని అడగడంతో.అలియా బట్ నన్ను అడుగుతావేంటి! అంటూ సమాధానం చెప్పింది.వీరి వ్యవహారశైలిని చూస్తే పెళ్లికి రణబీర్ సిద్ధంగా ఉన్నప్పటికీ అలియా ఈ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తోందా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోనే కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ.ఈ జంటను చూస్తుంటే ఇప్పుడప్పుడే పెళ్లి పీటలు ఎక్కేలా లేదు అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి పెళ్లి విషయంలో అలియా, రణబీర్ చెప్పిన ఈ సమాధానాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఇక వీరిద్దరూ కలిసి జంటగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అదేవిధంగా అలియా భట్ మొట్టమొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుండగా.

పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ఈ సినిమాలో అలియాభట్ సీత పాత్రలో ప్రేక్షకులను సందడి చేయనుంది.

తాజా వార్తలు