గత రెండు రోజులుగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రయాణం పై అనేక ఆసక్తికర విశేషణలు వినిపిస్తున్నాయి.రెండు పార్టీల పొత్తుపై ఉన్నత స్థాయి కమిటీ వెయ్యాలని రెండు పార్టీలు నిర్ణయం తీసుకొని తమ తమ సీనియర్ నాయకులను ఈ కమిటీల్లో భాగస్వామ్యం చేస్తున్నాయని వార్తలు వస్తున్న దరిమిలా, ఈ రెండు పార్టీల భవిష్యత్తు రాజకీయ ప్రయాణం పై ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేస్తున్నారు.
కలిసి పోరాటాలు చేస్తారని, ప్రభుత్వ అవినీతిని ఉమ్మడిగా దునుమాడతారని , రాష్ట్రవ్యాప్తంగా సభలు సమావేశాలు పెట్టి అధికార పక్షంపై పోరు సాగిస్తారని ఒకవైపు విశ్లేషణలు వస్తుండగా, మేనిఫెస్టోను( Manifesto ) కూడా ఉమ్మడిగానే రూపొందిస్తారు అంటూ ఒక కొత్త విశ్లేషణ వినిపిస్తుంది.నిజానికి విజయదశమి రోజున తెలుగుదేశం( TDP ) తమ ప్రధాన మ్యానిఫెస్టోను రిలీజ్ చేయాలని కసరత్తు చేసింది.

ప్రజలకు బవిష్యత్తు పై సరికొత్త ఆశలు రేకెత్తించేలా అద్భుతమైన మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని ఇంతకుముందే చంద్రబాబు ( Chandrababu Naidu ) సెలవిచ్చారు.అయితే ఆయన అరెస్టు తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు విచిత్రమైన మలుపులు తీసుకున్నాయి.ప్రస్తుతం కేసులు నడుస్తున్న విదానం చూస్తుంటే అసలు చంద్రబాబు ఎప్పటికీ బయటకు వస్తారో కూడా తెలియని పరిస్తితి ఉంది.ప్రస్తుత పరిస్థితిలో బలంగా అండగా ఉన్న జనసేన ను( Janasena ) అన్ని రకాలుగాను ఇన్వాల్వ్ చేసి ముందుకు వెళ్లాలని టిడిపి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.అందువల్ల మేనిఫెస్టోను కూడా సంయుక్తం గా గా రిలీజ్ చేయాలని,

అప్పుడే పొత్తు పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని ఇరు పార్టీల పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే జనసేనకు పవర్ షేరింగ్ పై ఇప్పటివరకు తెలుగుదేశం నుంచి బలమైన ప్రకటన ఏమి రాలేదు .అయితే ఉమ్మడి మేనిఫెస్టో సాధ్యమైతే మాత్రం కచ్చితంగా జనసేనకు పవర్ షేరింగ్ ఉంటుందని నమ్మవచ్చు.తద్వారా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మరింత సమైక్యత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది .మరి ఉమ్మడి మేనిఫెస్టో అంశం ఎంతవరకు విశ్వసనీయమో మరో నాలుగైదు రోజుల్లో ఒక అవగాహనకు రావచ్చు.







