సమ్మర్ హాలీడేస్ ని ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయాలని చూస్తారు విద్యార్ధులు.ఇక పిల్లలకు దొరికిన ఈ సమయాన్ని వారికి కావాల్సిన ఆనందాన్ని ఇవ్వడానికి పేరెంట్స్ కూడా అనుకుంటారు.
ఈ క్రమంలో విహార యాత్రలు ప్లాన్ చేస్తారు.వేసవి సీజన్ లో పర్యాటకులు, యాత్రికుల కోసం ఐ.ఆర్.సి.టి.సి ఓ ప్రత్యేకమైన టూర్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది.ఈ సరికొత్త టూర్ ప్లాన్స్ గురించి ఐ.ఆర్.సి.టి.సి ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ముఖ్యంగా విశాఖపట్నం టూ అరకు వరకు స్పెషల్ టూర్.
ఈ టూర్ లో ప్రతిరోజు వైజాజ్ నుండి అరకుకు వచ్చి అక్కడ అన్ని ఏరియాలను చూపించి మళ్లీ రాత్రికి వైజాగ్ కి తీసుకెళ్తారు.అరకు వ్యాలీలో ట్రైబల్ మ్యూజియం, టీ తోటలు, థింసా నృత్యం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ కూడా సందర్శించే అవకాశం ఉంటుంది.
వైజాగ్ నుండి అరకుకు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి అక్కడ అన్ని ప్రాంతాలని చూపించి మల్ళీ రోడ్ మార్గం ద్వారా రాత్రి విశాకపట్నం కి చేరేలా చూస్తారు.

వైజాగ్ నుండి అరకుకు వెల్లాలంటే విస్టాడోం కోచ్ లో వెల్లాలంటే పెద్దలకు 3060 రూపాయలు, పిల్లలకు 2670 రూపాయలు చార్జ్ చేస్తున్నారు.స్లీపర్ క్లాస్ కోచ్ అయితే 2385 రూపాయలు పెద్దలకు, పిల్లలకు 2015 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు.సెకండ్ సిటింగ్స్ కు పెద్దలకు 2185, పిల్లలకు 1815 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు.
ఈ ఖర్చుల్లో సైట్ సీయింగ్, రానుపోని ప్రయాణపు ఖర్చులు, టిఫిన్, భోజనం, సాయంత్రం టీ, బొర్రా కేవ్స్ టికెట్ ఛార్జ్ అన్ని ఏర్పాటు చేస్తారు.ఇదే కాకుండా తిరుమల దర్శన్ యాత్ర కూడా స్పెషల్ టూర్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ టూర్ లో కాణిపాకం, శ్రీపురం, తిరుమల స్వామి దర్శనం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ అన్ని కవర్ చేస్తారు.ఐ.ఆర్.సి.టి.సి స్పెషల్ టూర్స్ గురించి మరిన్ని వివరాలకు 0891-2500695, 8287932318 నెంబర్లకు సంప్రదించాలని వెల్లడించారు.







