ఆయన సినిమాల్లో హీరోగా యువతను విశేషంగా ఆకర్షించారు.కొంత కాలానికే తన తాత, తండ్రి పెంచిపోషించిన పార్టీలో చేరాడు.
యువజన విభాగ అధ్యక్షుడిగా యువతను పార్టీలోకి చేరేలా అవిరళ కృషి చేశారు.ఆయనే తమిళనాడు యువ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్.
ఓకే ఓకే, శీనుగాడి లవ్ స్టోరీ వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే.ఆయన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌పై పార్టీ శ్రేణుల నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తోంది.
ఉదయనిధి స్టాలిన్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.
గతేడాది జరిగిన ఎన్నికల్లో చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉదయనిధి స్టాలిన్ ఘన విజయం సాధించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాలలోనూ ఆయన ప్రచారం చేశారు.ఆ ఫలితం ఎన్నికలల్లో కనిపించింది.
ప్రజల్లో ఆయనకున్న విశేష జనాదరణ కారణంగా ఎన్నికలు పూర్తయ్యాక మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులును వారు చేసే కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానిస్తున్నారు.మంత్రులతో పాటు సమానంగా ఆయనకు ఆదరాభిమానాలు దక్కుతున్నాయి.

కొన్ని కార్యక్రమాలలో ఆయనను మంత్రులతో పాటు కూర్చోబెట్టాలంటే ప్రొటోకాల్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.దీంతో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం స్టాలిన్ యోచిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ఆయనను మంత్రిగా చూడాలని ఆ రాష్ట్ర యువత కోరుకుంటోంది.యువజన వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ వంటివి ఆయనకు ఇవ్వాలని పలువురి నుంచి సీఎం స్టాలిన్‌కు వినతులు అందుతున్నాయి.
మొదట్లో వాటిని అంతగా పట్టించుకోని సీఎం స్టాలిన్ ప్రస్తుతం ఏదో ఒక మంత్రి పదవి కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.దీంతో త్వరలోనే ఈ తమిళ హీరో మంత్రిగా అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.







