దేశ ఉపాధ్యక్షురాలికి కూడా కోవిడ్-19,ఆందోళనలో ప్రజలు

ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తున్న వైరస్ కరోనా(కోవిడ్-19).తొలుత చైనా లో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ఇరాన్ ను కూడా తీవ్ర స్థాయిలో కబళిస్తుంది.

ఆ దేశంలో కూడా కోవిడ్-19 కేసులు ఎక్కువ అయిపోయాయి.ఇప్పటికే ఈ వైరస్ సోకి 26 మంది ప్రాణాలు కోల్పోగా ఇంకా పలువురు ఈ వైరస్ తో బాధపడుతున్నారు.

ఇటీవల ఇరాన్ డిప్యూటీ ఆరోగ్య మంత్రికి కూడా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు మాసౌమే ఎబ్తేకర్ కు కూడా కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు ఆమె సలహాదారు ఫరీబా మీడియాకు వెల్లడించారు.

దీనితో ఇరాన్ వాసులు ఆందోళన చెందుతున్నారు.ఎబ్తేకర్‌కు మరీ ప్రమాదకర స్థాయిలో లేకపోవడంతో ఆమెను హాస్పిటల్‌లో కూడా అడ్మిట్ చేయనట్లు తెలుస్తుంది.

Advertisement

గత 24 గంటల్లో ఇరాన్‌లో 106 కొత్త కరోనా వైరస్ కేసులు వచ్చినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రతినిధి కైనిష్ జహన్‌పూర్ చెప్పారు.ఇప్పటికే ఇరాన్ లో ఈ కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ప్రబలిపోతుంది.

ఇప్పటికే ఈ వైరస్ సోకి 26 మంది మృతి చెందగా,మరో 245 మంది కరోనా వైరస్ తో చికిత్స పొందుతున్నారు.అంతేకాదు కొన్ని ఆంక్షలు కూడా విధించాలని యోచిస్తున్నట్లు జహాన్‌పూర్ చెప్పారు.

గత 24 గంటల్లోనే 106 కొత్త వైరస్ కేసులు నమోదు కావడం తో శుక్రవారం జరగాల్సిన నమాజ్‌లను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.మరోపక్క చైనా పౌరులకు ఇరాన్‌ ప్రవేశంపై నిషేధం కూడా విదించింది.చైనా ను కబళించిన ఈ కరోనా వైరస్ వల్ల దాదాపు 2800 మందికి పైగా మృతి చెందగా, 78 వేల మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు