ప్రముఖ స్మార్ట్ ఫోన్లో తయారీ సంస్థ ఐక్యూ కంపెనీ భారత మార్కెట్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే ఐక్యూ సంస్థ నుండి భారత మార్కెట్లోకి ఐక్యూఓఓ జెడ్ 7 ప్రో( IQOO Z7 Pro 5G ) పేరుతో ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల అయింది.

ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.యూనిక్ బ్లూ లాగూన్ పెయింట్ జాబ్ తో వస్తుంది.ఈ ఫోన్ 6.74 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది.ఫుల్ హెచ్డి రిజల్యూషన్ తో ఉంటుంది.ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్ సెట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్( Android 13 OS ) ఆధారంగా పనిచేస్తుంది.ఈ ఫోన్ కు వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది.64 ఎంపీ మెయిన్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్ తో ఉంటుంది.రెండు ఎంపీ సెన్సార్ కూడా ఉంటుంది.
సెల్ఫీల కోసం ముందువైపు 16 ఎంపీ మెగాపిక్సల్ సెన్సార్ ఉంటుంది.వైఫై 6, బ్లూటూత్ 5.3 ఉంటుంది.బ్యాటరీ విషయానికి వస్తే 4600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.66 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.డిస్ ప్లే లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23999.అయితే లాంచింగ్ ఆఫర్ కింద ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.21999 లకే పొందవచ్చు.256GB స్టోరేజ్ వే రూ.24999 గా ఉంది.లాంచింగ్ ఆఫర్ కింద రూ.22999 కే పొందవచ్చు.ఆఫర్లు కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే ఉంటాయి.
ఐక్యూఓఓ ఈ- స్టోర్ తో పాటు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్( Amazon ) లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.







