ఐక్యూ Z7 5G స్మార్ట్ ఫోన్ మార్చి 21 భారత మార్కెట్లోకి విడుదల కానుంది.ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ధర మరియు కలర్స్, ఫీచర్స్ ఏంటో చూద్దాం.
ఈ స్మార్ట్ ఫోన్ లో 8GB RAM * 128GB ఉంటుంది.ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 920 5G SoC ప్రాసెసర్ కలిగి ఉంటుంది.ఇందులో ఫన్ టచ్ ఓఎస్ 13 ఉంటుంది.64 మెగా పిక్సెల్ కెమెరా సిస్టం, 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంది.అరగంటలో 50% చార్జింగ్ పూర్తవుతుంది.ఇది అమోలేడ్ డిస్ప్లే మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంది.ఇండియాలో 6GB, 8GB ఎంపికలలో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో విడుదల చేయబడుతుంది.6GB వేరియంట్ తో విడుదలయ్యే మొబైల్ ధర రూ.17,000.ఇకా 8GB వేరియంట్ తొ విడుదలయ్యే ఫోన్ ధర రూ.20,000 లోపే ఉండవచ్చు.ఇది పసిఫిక్ నైట్ కలర్, నార్వే బ్లూ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
లాంచింగ్ తర్వాత మొదట అమెజాన్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
2022లో భారత్లో విడుదలైన ఐ క్యూ Z6 ఫోన్ 4GB * 128 GB స్టోరేజ్ మొబైల్ ఫోన్ రూ.15,499 గా ఉండేది.గత నెల ఫిబ్రవరిలో ఐక్యూ నియో 7 5G స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది.కంపెనీ ఈ ఫోన్ ను సోషల్ మీడియా ఛానళ్ల ద్వారా పోస్ట్ చేయబడిన లైవ్ ఈవెంట్లో లాంచ్ చేసింది.6.78 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 8200 SoC , 120W ఫాస్ట్ ఛార్జింగ్ లను కలిగి ఉంది.మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీల మధ్య పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యతరగతి వినియోగదారులు కొనుగోలు చేసేందుకు అన్ని రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటు ధరలలోనే విడుదల అవుతున్నాయి.