ఐఫోన్ కొనాలని అనుకొని డబ్బులు లేవని ఇబ్బంది పడుతున్నారా.అయితే మీకొక శుభవార్త.ప్రస్తుతం iPhone 13 కేవలం రూ.3,559కే లభిస్తోంది.ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే.అయితే ఇక్కడ షరతులు వర్తిస్తాయి సుమా.
ఇక ఈ బంపర్ ఆఫర్ ని ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ Flipkart తీసుకొచ్చింది.బెస్ట్ ఫ్లిప్‌కార్ట్ డీల్స్‌లో భాగంగా యాపిల్ iPhone 13ని నమ్మలేని ధరతో విక్రయిస్తోంది.
ఈ డీల్‌లో ఐఫోన్ 13 128GB వేరియంట్‌ని ఫ్లిప్‌కార్ట్ అమ్ముతోంది.దీని అసలు ధర అక్షరాలా రూ.79,900.కాగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఐఫోన్ 13పై ఏడు శాతం తగ్గింపును అందిస్తోంది.
దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.74,209కి తగ్గింది.ఈ డీల్‌లో ఫ్లిప్‌కార్ట్ EMI ఆప్షన్స్ వెసులుబాటు కల్పించింది.అయితే ఇపుడు iPhone 13ని చాలా తక్కువ ధరతో ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ద్వారా చాలా తక్కువ ధరకే దాన్ని పొందే వీలుంది.మీ వద్ద SBI క్రెడిట్ కార్డ్ ఉంటే.మీరు ఐఫోన్ 13ని కేవలం రూ.3,599కే కొనుగోలు చేయవచ్చు.ఎలా అంటే, 15 శాతం వడ్డీ రేటుతో నెలకు రూ.3,599 చెల్లించవచ్చు.ఈ లెక్కన చూసుకుంటే మీరు 24 నెలల్లో ఐఫోన్ 13 ధర మొత్తాన్ని పూర్తిగా చెల్లించవచ్చు.

ఇక EMI ఆప్షన్ వర్తించకపోయినా లేదా వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లించకూడదనుకున్నా కూడా ఈ ఫోన్‌పై అదిరిపోయే తగ్గింపులు పొందొచ్చు.ఎలాగంటే, ఫ్లిప్‌కార్ట్ ద్వారా 7% తగ్గుతుంది.అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే… రూ. 3,711 క్యాష్‌బ్యాక్ తిరిగి వచ్చేస్తుంది.ఇక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.ఇన్ని విధాలుగా మీరు రూ.23,902 తగ్గింపు ధరతో ఐఫోన్ దక్కించుకోవచ్చు.యాపిల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్, ఐఫోన్ 14 సెప్టెంబర్, 2022లో విడుదల కానుంది.దానిని కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.







