ఉచిత డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్(టైడ్స్ ) ఆద్వర్యంలో లైట్ మోటార్ వెహికల్ (ఎల్ఎంవీ), హెవీ మోటార్ వెహికల్ (హెచ్ఎంవీ)లో గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు టైడ్స్ ప్రిన్సిపల్ రాఘవన్ తెలిపారు.

ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన, ఎంప్లాయిమెంట్ జనరేషన్ , మార్కెటింగ్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3 నెలల ఉచిత శిక్షణ కార్యక్రమం తంగళ్లపల్లి మండలం మండేపల్లి టైడ్స్ లో ఉంటుందన్నారు.శిక్షణకు హాజరయ్యే యువతకు టైడ్స్ లోనే ఉచిత వసతి సౌకర్యం ఉంటుందని తెలిపారు.

ఉచిత డ్రైవింగ్ శిక్షణ( Free driving training )కు ఈ నెల 16 నుండి ప్రారంభం అవుతుందని, ఈ నెల 15 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలని తెలిపారు.

గ్రామీణ ప్రాంతానికి చెంది, 10 వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా పర్వాలేదని వివరించారు.అభ్యర్ధి ఎత్తు 160 సెంటీమీటర్ల పైన ఉండి, దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

Advertisement

శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మూడు నెలలపాటు అప్రెంటిస్ ఉంటుందని పేర్కొన్నారు.ఎల్ హెచ్ ఎం లైసెన్స్ ఏడాది పూర్తి అయిన వారికి హెచ్ ఎం వీ శిక్షణ ఇస్తామని తెలిపారు.

ఆసక్తి ఉన్నవారు 10 వ తరగతి సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డ్, కులం, ఆదాయం, బ్యాంక్ ఖాతా జిరాక్స్ ప్రతులు, 6 ఫోటోలు తీసుకురావాలని సూచించారు.వివరాలకు 8985431720 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.

ఈ అవకాశంను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News