టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ జరగనుంది.ఈ మేరకు మూడు స్కాం కేసులలో మొత్తం ఆరు అంశాలపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.
ముందుగా చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విచారణ జరపాలని సీఐడీ అధికారులు కోర్టును కోరుతున్నారు.అటు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ చేయాలని ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి విన్నవించారు.
ఈ క్రమంలో ఏసీబీ కోర్టు ఏ పిటిషన్ పై ముందుగా విచారణ చేస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అదేవిధంగా ఇవాళ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ పిటిషన్లపై కూడా న్యాయస్థానంలో విచారణ జరిగే అవకాశం ఉంది.
మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన అల్లర్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.







