పెళ్లైన తర్వాత జంటలను పిల్లలను కనాలని సూచిస్తుంటారు.అయితే కొందరికి వైద్య కారణాల వల్ల త్వరగా పిల్లలు పుట్టరు.
ఇంకొందరు మాత్రం తాము ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత పిల్లలను కనాలని ప్లాన్ వేసుకుంటుంటారు.ఏదేమైనా పిల్లలు పుట్టడం అనేది ఏ దంపతులకు అయినా మరపురాని సందర్భం.
అయితే తల్లిదండ్రులు కావడానికి తమను తాము సిద్ధం చేసుకునే వారు కూడా ఉన్నారు.అంటే పుట్టబోయే పిల్లల కోసం చాలా మంది బొమ్మలు, వారికి కావాల్సిన వస్తువులు ఇతర సరంజామా ముందుగానే కొనుగోలు చేస్తుంటారు.
కొందరైతే ఇళ్లలో పిల్లల కోసం ఏకంగా కిడ్స్ రూమ్ తయారు చేయిస్తారు.
అయితే లండన్‌కు ( London )చెందిన ఓ మహిళ ఇలా మాతృత్వ భావన పొందుతోంది.
ఆమెకు 13 మంది పిల్లలు.ఈ విషయం వింటే అంతా ఆశ్చర్యపోతారు.
ఆ 13 బొమ్మలు.వాటిని ఆమె తన పిల్లల్లా భావిస్తోంది.
వాటికి సపర్యలు చేస్తోంది.ఆ సమయంలో ఆమెకు భర్త కూడా సాయం చేస్తాడు.
జేస్ ఎల్లీస్ అనే మహిళ వృత్తి రీత్యా హెచ్‌ఆర్ బిజినెస్ పార్టనర్.ఆమెది తూర్పు లండన్‌లోని ప్లాస్టో ప్రాంతం( plasto region ).కోవిడ్ సమయంలో ఆమె లోన్లీగా ఫీల్ అయింది.దీంతో ఆన్‌లైన్‌లో కనిపించిన ఓ బొమ్మను కొనింది.
అది నిజంగా చిన్న పిల్లలా ఉంటుంది.ఇలా ఒకదాని తర్వాత మరొకటి మొత్తం 13 బొమ్మలను ఆమె కొనుగోలు చేసింది.
వాటి కోసం 6000ల యూరోలను ఖర్చు చేసింది.అంటే భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.6 లక్షలు.

అంతేకాకుండా వాటికి రోజూ ఆమె చిన్న పిల్లలకు చేసినట్లే సేవలు చేస్తోంది.డైపర్లు మార్చుతుంది.కొత్త బట్టలు వేస్తుంది.వాటి కోసం ఆమె పడే కష్టం చూడలేక ఆమె భర్త కూడా సాయం చేస్తున్నాడు.ఇలా చేయడంపై ఆమెను మీడియా ప్రశ్నించినప్పుడు తనలో మాతృత్వ భావనను ఈ బొమ్మలు పెంచుతాయని ఆమె చెబుతోంది.అంతేకాకుండా తనలో తల్లి అవ్వాలనే కోరిక బలపడిందని పేర్కొంది.







