హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( Shiva Balakrishna ) కేసులో ఏసీబీ( ACB ) అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగానే శివబాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.
కాగా శివబాలకృష్ణకు బినామీలుగా భరత్, భరణి, సత్యనారాయణ ఉండగా వారికి అధికారులు నోటీసులు అందజేశారు.
అదేవిధంగా శివ బాలకృష్ణ ఆస్తుల( Shiva Balakrishna Assets ) లావాదేవీలు నిలిపివేయాలని ఏసీబీ కలెక్టర్ కు లేఖ రాసింది.ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా విచారణ చేపట్టింది.ఏసీబీ అధికారుల కస్టడీలో శివబాలకృష్ణ వెల్లడించిన ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు సిద్ధమైంది.
ప్రభుత్వ అనుమతితో ఏసీబీ చర్యలు తీసుకోనుంది.
.