దిశా ఎన్ కౌంటర్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో ఎన్ కౌంటర్ పై కమిషన్ నివేదికపై విచారణ చేసిన న్యాయస్థానం ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.
ఇందులో భాగంగా ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై హత్య కేసును నమోదు చేయాలని అమికస్ క్యూరీ దేశాయి ప్రకాశ్ రెడ్డి హైకోర్టును కోరారు.అదేవిధంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలన్నారు.
ఈ విషయంపై వాదనలు వినిపించేందుకు సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరడంతో విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.